పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకోవడానికే పాదయాత్ర: బండి సంజయ్

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా కోరుట్లలో జోరుగా కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా సంజయ్.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభకు వచ్చిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లని.. ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల దొంగ సారా దందా చేసిన సీఎం బిడ్డను చూసి దేశమంతా నవ్వుకుంటోందన్నారు. కవిత…

Read More

రైతు కోరిక మేరకు ట్రాక్టర్ నడిపిన సంజయ్..!!

తెలంగాణలో బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐలాపూర్ గ్రామ సమీపంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ ని చూసి.. ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాల్సిందిగా కోరాడు. దీంతో సంజయ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు కోరిక తీర్చాడు. అనంతరం పాదయాత్రగా ఐలాపూర్ గ్రామంలోకి ప్రవేశించగానే..స్థానిక నేతలు, కార్యకర్తలు సంజయ్…

Read More

దళితుడి పై టిఆర్ఎస్ మహిళ సర్పంచ్ చెప్పుతో దాడి..!!

తెలంగాణాలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్.. దళితుడిపై చెప్పుతో దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ ఘటన వెనక కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! ఇక విషయానికొస్తే..నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో అర్హులకు.. ప్రభుత్వం దళిత బందు పథకం కింద నిధులు…

Read More

విశాఖపట్నం నోవాటెల్‌ లో పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌ కారులో షర్మిల!

Nancharaiah merugumala: ======================= ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా! కిందటి నెల అక్టోబర్‌ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్‌ స్టార్‌ను ఫైవ్‌ స్టార్‌ హోటెల్‌ నోవాటెల్‌ స్వీట్‌ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై…

Read More

తాండూరు కాంగ్రెస్ కు ఆశాకిరణంలా కనిపిస్తున్న నేత..!!

తాండూర్ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత..సరైన నాయకత్వంలేక డీలాపడిన కాంగ్రెస్  శ్రేణులకు నేనున్నాంటూ భరోసా కల్పిస్తూ ఆశాకిరణంలా దూసుకొచ్చాడు పట్లోళ్ల రఘువీరారెడ్డి. ఎన్నికల్లో వరుస ఓటములు..అంతర్గత కలహాలతో సతమతమవుతున్న నేతల్ని ఏకతాటిపైకి తెచ్చి పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు.అసలు ఉన్నట్టుండి రేస్ లోకి దూసుకొచ్చిన  రఘువీరారెడ్డి రాజకీయ  నేపథ్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండులను తట్టుకుని నిలిచి గెలిచే సత్తా అతనిలో…

Read More

ల్యాప్ టాప్ డాటా గల్లంతు.. మల్లారెడ్డి vs ఐటీ అధికారి..

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారి రత్న కుమార్ ల్యాప్ టాప్ చోరీ విషయంలో గందర గోళం కొనసాగుతోంది. ల్యాప్ టాప్ లోని  విలువైన డేటా తొలగించారని మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రత్న కుమార్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు  మంత్రి అనుచరులు ల్యాప్ టాప్ ఇంట్లోనే ఉందని చెప్పడంతో పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. కాగా ల్యాప్ టాప్ తీసుకెళ్లాలని  ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. అయితే ఐటీ అధికారులు…

Read More

విద్యాదాత మల్లన్నకే ఇన్ని కష్టాలు.. బక్కరెడ్లు, బడుగు రెడ్లు ఎలా బతకాలి?

Nancharaiah merugumala:  ……………………………………………….. కొన్ని దశాబ్దాల క్రితం బర్రెలను మేపుతూ, పేడ ఎత్తుకుంటూ, పాలు పితికారు తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లా రెడ్డి. తనలాగే పాలూ, పెరుగు అమ్ముకునే దోస్తు దుర్గయ్య యాదవ్ తో కలిసి మొదట బోయినపల్లిలో చదువుల వ్యాపారం లోకి దిగారు. క్రైస్తవులు నడపలేకపోతున్న హై స్కూలును కొని గాడిలో పెట్టారు. తరవాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి నాలుగు రాళ్లు కూడబెట్టారు. తెలుగు పాత్రికేయులు సహా తనకు సాయపడిన సామాన్యులందరినీ…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌కు జ్ఞానోదయమెప్పుడు..?

తప్పులు దొర్లడం సహజం. జరిగిన తప్పిదాలను మరోసారి జరుగకుండా.. చూసుకుంటు ముందుకు సాగడం ఆనవాయితీ. కాని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న తప్పిదాలను అధిష్ఠానం గుర్తించలేక పోతుందా..? లేదా తెలిసి ఊరుకుంటుందా..? అనే సందేహాలు అందరిని ఆలోచనల్లో పడేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణలో ప్రజలకు చేసిన మేలుకు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను కొత్త రాష్ట్రంలో…

Read More

కేసిఆర్, కేటీఆర్ పై పేలుతున్న సెటైర్స్.. వదల బొమ్మాళి వదల అంటున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. అబ్బా, కొడుకులు మాటలే తప్ప.. చేతల నేతలు కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.  ఇంతకు వీరిద్దరినీ నెటిజన్స్ టార్గెట్ చేయడం వెనక ఉద్దేశ్య ఎంటి? తెలంగాణలో దర్యాఫ్తు సంస్థల దాడుల కలకలం వేళ  ట్రోల్ చేయడం ఎంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.  కాగా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్.. చావు తప్పి కన్ను లొట్ట బోయిన…

Read More

జర్నలిస్ట్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఎవరిదో?

తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రముఖ తెలుగు చానెల్స్ కి చెందిన సీనియర్ మహిళా రిపోర్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి చెందిన సీనియర్ రిపోర్టర్ రెహానా ఈ పోటీలో ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. టీవీ 9 సీనియర్ రిపోర్టర్ హసీనా కూడా తన మార్గంలో, వైఎస్సార్ సీపీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు..ఉన్నతాధికారుల ఆశీస్సులతో తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తోంది. గవర్నర్…

Read More
Optimized by Optimole