మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు సెలెబ్రిటీల ట్విట్లపై దర్యాప్తు చెప్పనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ ప్రకటించారు. సెలెబ్రిటీల ట్విట్ల వెనక ఏదైనా పార్టీ ప్రమేయం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా పాప్ సింగర్ రిహనా, పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్, మినా హరిస్ ట్వీట్లు చేశారు. వీరికి వ్యతిరేకంగా కేంద్రానికి మద్దతుగా భారత రత్న సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, క్రికెటర్లు కోహ్లీ, ఆర్పీ సింగ్, సురేష్ రైనా , కరణ్ జోహార్, అక్షయ కుమార్, అజయ్ దేవ్గన్, ఏక్తా కపూర్ ట్వీట్లు చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు ఇంచుమించు ఒకే సమయంలో విడుదల అవడంతో కాంగ్రెస్ నేత సావంత్ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకోచినట్లు అనిల్ దేశముఖ్ వెల్లడించారు. దేశంలోని ప్రముఖ వ్యక్తులు ఇలా ఒకేసారి ట్వీట్లు చేయడం వెనక ఎవరైనా ఒత్తిడి ఉందా? లేక వీరి ట్విట్ల దాగున్న ఉద్దేశ్యం ఏంటో దర్యాప్తులో తేలుతుందని అనిల్ స్పష్టం చేశారు.