Budget2025: బీహార్ ఎన్నికల కోసమే కేంద్రం బడ్జెట్ : సరిత తిరుపతయ్య

Gadwal:

కేంద్ర బడ్జెట్ పై జెడ్పి మాజీ ఛైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య ఘాటుగా స్పందించారు.బీహార్ ఎన్నికల కోసమే అనేలా కేంద్రం బడ్జెట్ ఉందన్న ఆమె.. వరుసగా 8 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగు మహిళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కాంగ్రెస్ పార్టీ కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కోడలు అయిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్ష చూపడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు నయా పైసా కేటాయించకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రానికి నిధుల కోసం సీఎం రేవంత్, మంత్రులు వెళ్లి ప్రధాన మంత్రిని కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కేంద్ర బడ్జెట్ వివక్ష పట్ల కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలన పట్ల అని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సరితతిరుపతయ్య స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole