చెన్నె సూప‌ర్ కింగ్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నె సూప‌ర్ కింగ్స్ కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హెజెల్ వుడ్ ఈఏడాది ఐపీఎల్ టోర్నికి దూర‌మ‌వుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించాడు. సుధీర్ఘ కాలం బయో బ‌బుల్‌లో ఉన్నందున, విశ్రాంతికోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వుడ్‌ తెలిపాడు. రాబోయే రెండు నెల‌లు కుటుంబ స‌భ్యుల‌తో ఆస్ట్రేలియాలో గ‌డ‌ప‌నున్న‌ట్లు వుడ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, యాషెస్ సిరిస్లతో పాటు టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఉన్నందున దానిని దృష్టిలో పెట్టుకొని వుడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Optimized by Optimole