×

Nancharaiah merugumala senior journalist:

పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్‌ అని బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి!

‘‘ నా అసలు ఇంటిపేరు సింగ్‌. నేను పంజాబీ రాజపూత్‌ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయచేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్‌) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల క్రితం (2019 ఎన్నికలకు ఏడు నెలల ముందు అంటే 2018 ఆగస్టు చివర్లో) తనను తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ఆప్‌ అభ్యర్ధిగా ప్రకటించాక నాటి మంత్రి ఆతిశీ మార్లెనా ఇచ్చిన విరణ ఇది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్ధిగా బరిలోకి దిగినాక బీజేపీ నుంచి వచ్చే ఇబ్బందులను ముందుగానే ఊహించిన ఆతిశీ తన పేరులో రెండో మాట ‘మార్లెనా’ను అన్ని ‘ఆప్‌’ రికార్డుల నుంచి, ఎన్నికల ప్రచార సామాగ్రి నుంచి తొలగిస్తున్నానని ప్రకటించారు. జనం అనుకుంటున్నట్టు తనను క్రిస్టియన్‌ అని జనం పొరపడతారనే భయంతో మార్లెనా అనే మాటను పేరు నుంచి తొలగించలేదని కూడా ఆమె అప్పుడు చెప్పారు. దీనిపై ఆమె కన్నా ముందు ఆ ఆ పార్టీ నేత ఒకరు ఆ రోజుల్లోనే వివరణ ఇస్తూ, ‘‘ ఆతిశీ పేరు మధ్యలో మాట మార్లెనాను బట్టి ఆమె విదేశీ మహిళ అని, క్రైస్తవ స్త్రీ అనే ప్రచారంతో బీజేపీ వాళ్లు ప్రజలను చీల్చి లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆమె మార్లెనాను ఎన్నికల ప్రచారంలో లేకుండా వదిలేశారు,’’ మీడియా ముందు ప్రకటించారు.

 ఆతిశీ కూడా దీనిపై మాట్లాడుతూ, ‘‘ నేను ఎవరో (జాతి, మతం, కులం) పదే పదే నిరూపిస్తూ సమయం వృధా చేయడం నాకిష్టం లేదు,’’ అని చెప్పారు. 43 ఏళ్ల క్రితం పంజాబీ కమ్యూనిస్టు ప్రొఫెసర్లు తృప్తా వాహీ, విజయ్‌సింగ్‌ తోమర్‌కు జన్మించింది ఆతిశీ. వారికి ఇష్టులైన కారల్‌ మార్క్స్, వ్లాదిమిర్‌ లెనిన్‌ ఇంటి పేర్ల మొదటి పేర్లను కలిపి ‘మార్లెనా’ అనే మాటను కూతరు ఆతిశీ రెండో పేరుగా జోడించారు ఇద్దరు ప్రొఫెసర్లు. అలా ఆమె పేరు ఆతిశీ మార్లెనా సింగ్‌ అయింది గాని ఆమె తన మతం, కులాన్ని సూచించే సింగ్‌ను పెద్దగా వాడుకోలేదు. తనను క్రిస్టియన్‌గా బీజేపీ వాళ్లు ముద్రవేసి ప్రచారంచేసే అవకాశం ఇవ్వకుండా ఆతిశి 37 వయసులోనే అంతగా జాగ్రత్తపడ్డారు. అందుకే ఆమెకు ఇతర అర్హతలు కూడా తోడుగా చేరడంతో జిత్తులమారి పూర్వ ఐఆర్‌ఎస్‌ అధికారి అరవింద్‌ కేజ్రీవాల్‌ వారసురాలు కాగలిగారు.

ఆతిశీ థ్యాంక్స్‌ చెప్పాల్సింది సౌత్‌ లికర్‌ లాబీకి!

ఆతిశీ పైన చెప్పినట్టు తన నాయకుడి బాటన నడవడం ఆరేళ్ల క్రితమే నేర్చుకున్నారు. తాను రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, మూడోసారి భారీ మెజారిటీతో గెలిచి దిల్లీలో అధికారం చేపట్టినప్పటి నుంచీ కేజరీవాల్‌ను బీజేపీ వెంటాడుతూనే ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో నరేంద్రమోదీతో కేజ్రీవాల్‌ తలపడడాన్ని బీజేపీ మర్చిపోలేదు. లెఫ్టినెంట్‌ గవర్నర్ల ద్వారా ఆప్‌ తొలి ముఖ్యమంత్రిని నానా తిప్పలు పెట్టింది నరేంద్రమోదీ–అమిత్‌ షాల నాయకత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు. కాషాయపక్షాన్ని తట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ దారిలోనే నడిచారు కేజ్రీవాల్‌. 2020 ఫిబ్రవరి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికే బీజేపీ రాముడికి పోటీగా హనుమండిని ఆయుధంగా చేసుకున్నారు హరియాణాలో కుటుంబ మూలాలున్న అగర్‌వాల్‌ వైశ్య నేత అరవింద్‌. హనుమాన్‌ చాలీసాతో బీజేపీని కట్టడి చేసే ప్రయత్నాలు కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు నుంచి కాపాడలేకపోయాయి. జాతీయ మద్యం లాబీలో భాగమైన దక్షిణాది గ్రూప్‌ పుణ్యమా అని కేజరీవాల్‌ అరెస్టయ్యారు. దక్షిణాది మద్యం వ్యాపారులు ఆఫ్రికా ఖండానికి వెళ్లి మరీ వ్యాపారం చేయగలరు గాని మోదీ–షా సర్కారు ‘కొట్టుడు’కు తట్టుకోలేరని నెల్లూరు జిల్లాకు చెందిన బలిసిన ఇద్దరు రెడ్లు– మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పెనక శరత్‌ చంద్రా రెడ్డి (అరవిందో ఫార్మా) నిరూపించారు. అవినీతిపై యుద్ధం ప్రకటించి పెద్దగా అధికారాలు లేని దిల్లీ ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు కైవసం చేసుకున్న కేజ్రీవాల్‌ దక్షిణాది మద్యం లాబీ గాజు సీసాల దెబ్బతో తిహాఢ్‌ జైలుకు రెండుసార్లు పోయి చివరికి పదవికి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి లోగా జరగాల్సిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కొత్త రాజకీయ నాటకానికి తెరతీసిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో మరి. ఆయన వారసురాలిగా తెలివైన ఆతిశీ ‘ఆప్‌’ అదృష్టమే అనుకోవాలి.

 ( ఫోటో 1. తల్లిదండ్రులలో ఆతిశీ, ఫోటో 2. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను పోటీచేసిన ఈస్ట్ డిల్లీ నియోజకవర్గ ‘ఆప్’ ఎన్నికల ఆఫీస్ లో చేస్తున్న హోమంలో పాల్గొన్న ఆతిశీ)

ఏదేమైనా ‘సౌత్‌ గ్రూప్‌’గా దేశ రాజధానిలో పేరుమోసిన దక్షిణాది రాష్ట్రాల లికర్‌ లాబీ తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో హరియాణివీ అగర్వాల్‌ వైశ్య నేతను ఇరికించబట్టే కమ్యూనిస్టు మహామహోపాధ్యాయులు కారల్‌ మార్క్స్, వ్లాదిమిర్‌ ఇల్యిచ్‌ లెనిన్‌ల ఇంటిపేర్లను కలిపి తన మిడిల్‌ నేమ్‌గా పెట్టుకున్న ఆతిశీ మార్లెనా సింగ్‌ దిల్లీ గద్దెనెక్కబోతున్నారు. ప్రచారానికి ఆమడ దూరంలో ఉండే ఆతిశీ భర్త ప్రవీణ్‌ సింగ్‌ ఐఐటీ, ఐఐఎంలతో చదివి నిరంతరం పరిశోధన చేస్తుంటారని మీడియా వార్తలు సూచిస్తున్నాయి.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all
Optimized by Optimole