హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చెంచా కౌశిక్ కథలు ఎక్కువయ్యాయని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌశిక్ రెడ్డికి ఇదే చివరి హెచ్చరికకని..సీఎం రేవంత్ పై మరోసారి నోరు పారేసుకుంటే చెంచా మాదిరి ఇరిచేస్తానని..ఇది స్వీట్ వార్నింగ్ కాదు డెడ్లి వార్నింగ్ అంటూ రెచ్చిపోయారు.
బిఆర్ఎస్ పార్టీలో ఎన్నో చెంచాలు ఉన్నప్పటికీ.. అందులో చెంచా కౌశిక్ చేస్తున్న శబ్దమే ఎక్కువైందని ధ్వజమెత్తారు.”సారు కారు పదహారు అని నినాదాలు చేసేవాడు.. ఇప్పుడు ఆ సారు కారే పరారయ్యారు కదా.. దాని గురించి మాట్లాడాలి కదా చెంచా కౌశిక్?” అని ప్రశ్నించారు. “గతంలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ గారే చెంచా కౌశిక్ ఎందుకు పనికిరాడని పట్టించుకోలేదని గుర్తుచేశారు.” చెంచా కౌశిక్ స్థాయి తెల్సుకుని మాట్లాడాలని హితువు పలికారు. స్థాయి మరిచి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. “మొగోడివైతే రా చెంచా కౌశిక్ తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. బయట రాష్ట్రం నుంచి కిరాయి రౌడీలను తెచ్చుకున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.