Telangana: సోనియా గాంధీ జన్మదినొత్స‌వాన్ని ఘనంగా నిర్వహిస్తాం : టీపీసీసీ మ‌హేష్ కుమార్

INCTELANGANA: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినొత్స‌వాన్ని డిసెంబ‌ర్ 9 వ‌తేదిన‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని నిర్ణ‌యించిన‌ట్లు టీపీసీసీ అధ్య‌క్షుడు ,ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.మాజీ సీఎం కెసిఆర్ ను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల పండుగని.. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదని అన్నారు. శుక్ర‌వారం మహేష్ గౌడ్ గాంధీభ‌వ‌న్లో మీడియాతో మాట్లాడారు.రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. కేటీఆర్‌ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు. సీఎం రేవంత్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. బి. ఆర్. ఎస్ పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు.. కాంగ్రెస్ ఏడాది లో ఇచ్చింది.

ప‌గ‌టి క‌లలు..

అధికారం కోల్పోయిన కేటీఆర్ లో ఏమాత్రం అహంకారం త‌గ్గ‌లేద‌ని మ‌హేష్ గౌడ్ మండిప‌డ్డారు. ఇప్ప‌టికైన‌ కేటీఆర్ ప‌గ‌టిక‌ల‌లు క‌న‌డం మానేయాల‌ని హితువు ప‌లికారు. బిఆర్ఎస్ హ‌యంలో లక్షల కోట్లు దోపిడీ జ‌రిగింది.. ఇక ఆపార్టీ అధికారంలోకి వచ్చే ప్ర‌సక్తే లేదని తేల్చిచెప్పారు.కాంగ్రెస్ పార్టీ పెడుతున్న విగ్రహం తెలంగాణ ను ప్రతిబింబించే విధంగా ఉంద‌ని..ఆనాడు బిఆర్ఎస్ పెట్టిన విగ్ర‌హం దొరకు ప్రతిబింభంగా ఉంద‌ని ఎద్దేవ చేశారు.దేశం లో అతి తక్కువ సమయం లో ఎక్కువ దోచుకుంది కెసిఆర్ కుటుంబం మాత్ర‌మేన‌ని అన్నారు.సీఎం రేవంత్ పాలనలో ఎలాంటి నిర్భంధం లేదని.. ప్ర‌తి ఒక్క‌రికి స్వేచ్ఛ గా నిరసన తెలుపుకునే అవకాశం ఉంద‌న్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లి ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకునేది లేద‌న్నారు. బిఆర్ఎస్‌ వ్యవహరిస్తున్న తీరుతో.. తండ్రి కొడుకు లు తప్ప ఎవరు ఆపార్టీలో మిగిలే పరిస్థితి లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కౌశిక్ రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని.. చట్టం ఎవరికి చుట్టం కాద‌ని టీపీసీసీ చీఫ్ వెల్ల‌డించారు.

కిస్మ‌త్ రెడ్డి..
తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు, కిషన్ రెడ్డి.. కిస్మత్ రెడ్డి లా మారిపోయారని మ‌హేష్ గౌడ్ పేర్కొన్నారు. కిష‌న్ రెడ్డి తెలంగాణ‌కు చేసిన మేలు ఏంటో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మూసి గురించి మాట్లాడే బీజేపీ నేత‌లు.. సభర్మతి గురించి ఎందుకు మాట్లాడటం లేద‌ని? అక్కడ పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. పేద‌ల‌కు గురించి మాట్లాడే అర్హ‌త బీజేపీ నేత‌ల‌కు లేద‌ని మ‌హేష్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.

Optimized by Optimole