EAGLEREVIEW: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఈగల్. కావ్య థాపర్ , అనుపమ పరమేశ్వరన్ కథనాయికలు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈచిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఈగల్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈమూవీతోనైనా హిట్ ట్రాక్ లో పడ్డాడా? లేదా తెలుసుకుందాం..
కథ ; ఆంధ్రప్రదేశ్ మదనపల్లె తాలుకాలోని తలకోన అడవుల్లో ఓగిరిజన తండా వాసులు సహదేవవర్మ(రవితేజ) విగ్రహన్ని పెట్టుకొని ఆరాధిస్తుంటారు. అయితే జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్ ) అటవీ ప్రాంతంలో ఉండే పత్తికి( కాటన్ క్లాత్) సంబంధించి ఓ ఆర్టికల్ రాస్తుంది. దీంతో పత్తికి సంబంధించిన మూలాలు పోలాండ్ లో బహిర్గతం అవుతాయి. విషయం తెలుసుకున్న సీబీఐ..నళిని పనిచేసే పత్రిక సంస్థను ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంతకు సహదేవవర్మ ఎవరు? నళిని పరిశోధనలో బయటపడిన వాస్తవాలు ఏమై ఉంటాయి? ఈ మొత్తం వ్యవహరంలో ఈగల్ నెట్ వర్క్ కు సహదేవవర్మ కు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.
ఎలా ఉందంటే..?
ఈగల్ పక్కా స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈగల్ నెట్ వర్క్ తో సినిమా మొదలవుతుంది. హీరొయిన్ అనుపమ(నళిని) రాసిన ఆర్టికల్ లోని కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. కానీ ఆ పాత్రలతోనే ఫస్ట్ ఆఫ్ నడుస్తుంది. ఇంటర్వెల్ (విరామం) కి ముందు అసలు కథ స్టార్ట్ అవుతుంది. దీంతో మొదటి భాగం పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సెకండాఫ్ లో ఈగల్ నెట్ వర్క్ కి సంబంధించి పోలాండ్ లో జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాలు (ఎమోషన్ సీన్స్) ఆకట్టుకుంటాయి. ద్వితీయార్థం ఫర్వాలేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
హీరో రవితేజ ఎప్పటిలానే మాస్ అండ్ హైవోల్డేజ్ యాక్షన్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ కావ్యథాపర్, అనుపమ తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. తెలుగులో ఫస్ట్ సినిమా అయిన కావ్య థాపర్ ఎమోషన్ సీన్స్ లో ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన నవదీప్, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల అదరగొట్టేశారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక నిపుణులు..
దర్శకుడు కార్తీక్ ఈకథను కథలు కథలుగా చెప్పే ప్రయత్నం చేశాడు . నిర్ణయం..నివారణ.. నియంత ప్రాసతో కూడిన కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. కథనం పరంగా అతను సక్సెస్ కాలేకపోయాడు. కథ పరంగా అక్కడక్కడ వచ్చే సీన్స్ ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తాయి. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ అద్భుతం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
“ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మహారాజా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా “
రివ్యూ రేటింగ్ ; 2. 75/5