Pmmodi: నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు!

Nancharaiah merugumala senior journalist:

” ప్రధాని పదవిలో ఉండగా ‘భారతరత్నాలు’గా మారిన నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు! ” 

భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ, మూడో ప్రధాని, ఆయన కూతురు ఇందిరా ప్రియదర్శినీ నెహ్రూ–గాంధీలకు వారు అధికారంలో ఉండగానే భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. మరో రకంగా చెప్పాలంటే చాచాజీ, ఇందిరాజీలు తమకు తామే భారత అత్యున్నత పౌర పురస్కారం ఇప్పించుకున్నారు. పది సంవత్సరాల పరిపాలన చూశాక ఇందిరమ్మ తరహా నియంతృత్వ బాటలో నడుస్తున్న ‘తానాషాహీ’ ప్రధానిగా నరేంద్ర మోదీ కొందరి కళ్లకు కనిపిస్తున్నారు. కనీసం భారతరత్న విషయంలోనైనా ఈ తండ్రీకూతుళ్ల మాదిరిగా (అధికారలో ఉన్నప్పుడు ) నరేంద్ర మోదీ వ్యవహరించకపోతే మంచిది. తాము అధికారంలో ఉండగా భారతరత్నాలుగా మారే హక్కు కేవలం నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యులకే ఉందనే విషయం గుజరాతీ మోఢ్‌ ఘాంచీ తేలీ ప్రధాని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.