భాజాపా కురవృద్ధుడు కళ్యాణ్ సింగ్ కన్నుమూత!

యూపీ​ మాజీ సీఎం, భాజపా సీనియర్​ నేత కల్యాణ్‌సింగ్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొద్దరోజులుగా లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

బాల్యం..
కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ 1932 జనవరి 5 న మారుమూల గ్రామంలో జన్మించారు.చిన్నపాటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే జన్ సంఘ్.. జనతా పార్టీ.. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. నిబద్దతో పనిచేస్తూ యూపీ కి రెండు సార్లు సీఎం గా ఎన్నికయ్యారు. రాజస్థాన్ గవర్నర్ గా సైతం కళ్యాణ్ సింగ్ పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం..
దేశ రాజకీయాల్లో కల్యాణ్ సింగ్ కు ప్రత్యేక స్థానం ఉంది.
భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన కల్యాణ్​ సింగ్​ ప్రస్థానం భావి తరాలకు ఆదర్శం.
నిబద్దతతో ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి.. అత్యున్నత పదవులు పొందే స్థాయికి చేరారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చనేదానికి కల్యాణ్ సింగ్ జీవితం నిదర్శనం.
1992లో అయోధ్య రామ మందిర ఉద్యమంలో కల్యాణ్ సింగ్ దేశమంతా మార్మోగింది. డిసెంబర్​ 6న వేల మంది కర సేవకులు అయోధ్యలో సమావేశమైన సమయంలో.. కల్యాణ్​ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మసీదు ఘటన యావత్​ దేశంలో సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు కల్యాణ్​ సింగ్​. అయితే సీఎం పదవి కోల్పోయినప్పటికీ, నాడు జరిగిన ఘటనపై తాను గర్వపడుతున్నానని అనేకమార్లు పేర్కొన్నారు కల్యాణ్​సింగ్​.