రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు..

పోర్న్ రాకెట్ కేసులో అరెస్టు అయిన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్​ కుంద్రాకు(raj kundra news hindi) బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది.

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపారి రాజ్​ కుంద్రాకు తాత్కాలిక ఊరట లభించింది. ముంబయిలోని న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్ తోర్పేకూ ముంబయి కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా పోర్న్​ చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు సాగిస్తున్న అధికారులు.. సాక్ష్యాలను సేకరించి కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కుంద్రాపై ఇటీవలే 1,400 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు అధికారులు. మరోవైపు కుంద్రా కూడా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.