Nalgonda: పట్టణంలోని ప్రకాశంబజార్ నందు విశ్వన్ సాయి తల్లి,పిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది . సోమవారం నిర్వహించిన ఈ శిబిరంలో.. 2వేలు విలువగల ఎముకల సాంద్రత పరీక్షలను నిర్వహించినట్లు డాక్టర్ ప్రణతి కజ్జం (MBBS., MS., (OBG) F. MAS, D. MAS ప్రసూతి మరియు స్త్రీల వైద్యనిపుణులు ఇన్ ఫర్టిలిటీ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్) (Gold medalist ) తెలిపారు .
వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ సందీప్ కుమార్ కజ్జం (M.B.B.S., M.D (PAED), NALS.. (పురిటి మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు) మాట్లాడుతూ.. ఎముకల సాంద్రత పరీక్షతో పాటు అవసరమైన వారికి ఉచిత మందుల పంపిణి చేశామన్నారు. సుమారుగా 200 మంది వైద్యసేవలు వినియోగించుకున్నట్లు ఆసుపత్రి చైర్మన్ కజ్జం దయాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన Santova Pharmaceuticals Pvt Ltd ప్రతినిధి K. Rambabu (Area business Manager), Urmila Devi (technician) తో పాటు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.