మిర్చి సరన్… ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్!

– ‘ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్’ గా ప్రశంసలు పొందుతున్న యువ ఆర్జే సరన్.
– సంవత్సర కాలంలోనే లక్షల మంది హృదయాలను తాకిన టాలెంట్. 

అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన యువ ఆర్జే, మిర్చి సరన్, ఆర్జేగా సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘మిర్చి సరన్… వన్ ఇయర్ ఆన్ ఎయిర్ సెలబ్రేషన్స్’ పేరిట మిర్చి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలు డిసెంబర్ 5న ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా, రోజూ సాయంత్రం వచ్చే మిర్చి సరన్ షో వినే శ్రోతలకు సర్ప్రైజ్ లకు ఏమాత్రం కొరత ఉండదు.

జీవితంలో ప్రతి మలుపు ఒక మైలు రాయే, ప్రతి మైలు రాయిని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కాబట్టి, ఈ సంవత్సర కాలంలో ఆర్జే గా సరన్ సాధించిన విజయాలను ఒక మైలురాయిగా గుర్తించి, మిర్చి ఈ వేడుకలు నిర్వహిస్తోంది. ఒకవైపు టీవీ, ఇంకోవైపు మొబైల్… శాసిస్తున్న ఈ కాలంలో ఎఫ్.ఎం రేడియోలో జాకీగా పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ, సంవత్సరం కింద మిర్చిలో రేడియో జాకీగా పరిచయమైన ఈ బిటెక్ కుర్రాడు, సరన్, ఈ నానుడికి భిన్నంగా హైదరాబాద్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్’ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు వచ్చే అతని షో ద్వారా హైదరాాబాద్ శ్రోతల మనసు గెలుచుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ తో ఇంటర్వ్యూలు చేస్తూ, మూవీస్ లో వస్తున్న ట్రెండ్స్ ని, అప్ డేట్స్ ని అందిస్తూ మూవీ ఫ్రీక్ గా పేరు సంపాదించాడు. ఇక, తను స్పోర్ట్స్ గురించి మాట్లాడితే అచ్చంగా స్పోర్స్ట్ ఎనలిస్ట్ మాట్లాడినట్టే అనిపిస్తుంది.


మిర్చి సరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే… ఏ ట్రెండింగ్ టాపిక్ ని అయినా… శ్రోతలను నవ్వించేలా హ్యూమరస్ గా చెప్తాడు. అందుకే, ఈవినింగ్ డ్రైవ్ టైంలో అతనికి చాలామంది శ్రోతలు కాల్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటుంటారు.
ఇక, ఇప్పుడు రేడియోలో వినిపిస్తే సరిపోదు, సోషల్ మీడియాలో కనిపించాలి. ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అప్పుడే స్టార్ ఆర్జే అనిపించుకుంటారు. ఈ విధంగా చూసినప్పుడు స్టార్ ఆర్జే ట్రాక్ లో దూసుపోతున్నాడు మిర్చి ఆర్జే సరన్. యువతని లక్ష్యంగా చేసుకొని, తను ఇన్ స్టా గ్రామ్ లో చేసే రీల్స్ మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఒక సంవత్సరంలోనే 30 వేలమంది ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం అతని టాలెంట్ కి నిదర్శనం.

మరోవైపు ఆడియో స్టోరీస్ కోసం మిర్చి కొత్తగా  తీసుకొచ్చిన మిర్చి ప్లస్ యాప్ లో కూడా సరన్ తన సత్తా చాటుకుంటున్నాడు. తను గాత్రదానం చేసిన ‘దొరికితేనే దొంగ’ అనే ఆడియోస్టోరీ పదివేలకు పైగా డౌన్ లోడ్స్ తో రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మిర్చి సరన్ వన్ ఇయర్ ఆన్ ఎయిర్ సెలబ్రేషన్స్ పురస్కరించుకుని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మిర్చి బిజినెస్ డైరెక్టర్ నజుముద్దిన్ హుస్సేన్ మాట్లాడుతూ… ‘ మిర్చి కేవలం టాలెంట్ ని గుర్తించడంతోనే ఆగిపోదు, ఆ టాలెంట్ ఎదిగేలా అన్ని రకాల అవకాశాలను, సహాయ సహాకారాలను అందిస్తుంది. ఇది మిర్చిలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఇప్పుడు మిర్చి సరన్ కూడా అదే వరసలో నిలబడతాడు. తను ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆశిస్తున్నాను. తను ఇలాంటి వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని, ఇలాగే శ్రోతల మనసు గెలుచుకుంటూ మరింత ఎత్తుకు ఎదుగుతాడని నమ్ముతున్నాను’ అని చెప్పాడు.
మిర్చి సరన్ వన్ ఇయర్ ఆన్ ఎయిర్ వేడుకల సందర్భంగా మిర్చి ఆఫీస్ లో సందడి నెలకొంది. అలాగే, మిర్చి సరన్ కి సంబంధించి ప్రత్యేకంగా ప్రొమోలు, వీడియోలు రూపొందించారు. వాటిని మిర్చి సోషల్ మీడియా యాప్స్, మిర్చి సరన్ ఇన్ స్టాగ్రామ్ పేజీపైన చూడవచ్చు.

Optimized by Optimole