Telangana : పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ,సియసత్ ఉర్దూ దిన పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ జహీర్ అలి ఖాన్ ల స్మారక సభ నిర్వహించారు. వీరి ఆకస్మిక మరణం తో రాష్ర్టం ఒక్కసారి ఉలిక్కి పడింది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్మాల అన్నారు. సియాసత్ పత్రిక యాజమాన్యం ఎప్పుడూ ప్రజల పక్షం నిలబడిందని ..పాత బస్తీ నిరుపేద మహిళల అభివృద్ది కోసం చాలా సహాయంగా నిలబడ్డారు అని అన్నారు. గద్దర్ ఒక మనిషి కాదు ఒక విప్లమని..ఈ విప్లవం ఆగదు సాగుతూనే ఉంటుందని అన్నారు. వీరిద్దరి లోటు ఎవ్వరూ పూడ్చలేనిదాని.. వారి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందుకు అడుగులు వేయాలని కోరారు. లౌకిక స్వభావం కలిగిన వ్యక్తి జహీర్ అలి ఖాన్ అని కొనియాడారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ కొద్ది రోజుల క్రితమే కలిశాను..అప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఉద్యమాల నిర్మాణం లో గద్దర్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. జహీర్ అలి ఖాన్ ఆ రోజుల్లో ఉర్దూ పత్రిక నడిపించిన ధీశాలి అని కీర్తించారు. వారి నాన్న శియాసత్ పత్రికను స్థాపించారని గుర్తు చేశారు. గద్దర్,జాహీర్ అలి ఖాన్ ఇద్దరూ ఒక రోజు తేడాతో మరణించడం విచారకరమని దామోదర్ రెడ్డి అన్నారు. ఈ స్మారక సభలో PUCL సభ్యులు ఇక్బాల్ ఖాన్, రూఢా హరీట్,ఎం.డి ఖాజా, షేక్ షాజిద్, యాఖుబ్ , యూసఫ్, మసూద్, సుదర్శన్ రెడ్డి, సలీం, తదితరులు పాల్గొన్నారు.