సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..

సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..

సూపర్​స్టార్​ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన రజినీ డిశ్చార్జ్​ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఓ సర్జరీ కూడా చేశారు. అది విజయవంతంగా పూర్తైందని వైద్యులు వెల్లడించారు. దీంతో సూపర్ స్టార్ అభిమనులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా 70ఏళ్ల రజనీకాంత్​ ఇటీవలే దిల్లీకి వెళ్లి దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. అక్కడ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కలిశారు.ప్రస్తుతం రజనీ నటించిన ‘అన్నాత్తే’ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది