Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!

Nancharaiah merugumala senior journalist:  గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది!

జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం ఇంకా చాలా ఆలస్యంగా తెలిసింది. బీఎస్పీ స్థాపకుడు కాశీరాం మాదిరిగానే గుల్జార్ కూడా పంజాబీ సిక్కు కుటుంబంలో పుట్టారని. కాశీరాం చమార్ కాగా, గుల్జార్ ఖత్రీ. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కాల్రా అనేది కూడా మొన్న మొన్నే తెలిసింది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ మాదిరిగానే పశ్చిమ పంజాబ్ (ఇప్పుడు మన దాయాది దేశం పాకిస్తాన్ లో ప్రధాన భూభాగం) లో గుల్జార్ జన్మించారని. మన్మోహన్ జీ కన్నా రెండేళ్ల చిన్నవాడైన గుల్జార్ సాహెబ్ ది  కూడా డాక్టర్ సాబ్ లాగానే పంజాబీ ఖత్రీ ( క్షత్రియ ) సిక్కు కుటుంబమే.