లంకేయులపై భారత బౌలర్ల సవారి..నేరుగా సెమీస్..

Worldcup2023: వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ సెమీస్ దూసుకెళ్లింది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొలుత  బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు 357 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 55 కే ఆలౌట్ అయ్యింది. భారత బౌలరల్లో షమీ 5 , మహమ్మద్ సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్ పడగొట్టారు.

ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. గిల్, శ్రేయస్,కోహ్లి అర్థ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక  ఒక్కడే 5 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో లంక జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల బుల్లెట్ లాంటి బంతులకు లంకేయుల వద్ద సమాధానం లేకపోయింది. ఫలితంగా 302 భారీ పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.  ఈ విజయంతో భారత్ నేరుగా సెమీస్ దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో 7 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.