కేటీఆర్ చేతుల మీదుగా మిర్చి 98.3 పవరాన్ షో ప్రారంభం

Radiomirchi :అత్యుత్తమ కంటెంట్, వినూత్న రీతిలో అందించే 98..3 రేడియో మిర్చి… ‘‘మిర్చి పవరాన్’ పేరిట మరో కొత్త సెగ్మెంట్ ని ముందుకు తీసుకొచ్చింది. పేరులో పవర్ ఉన్నట్టుగానే, శ్రోతలను చార్జ్ చేసే విధంగా అతిథులతో ఈ షో ఉంటుంది. ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోకుండా, కేవలం ప్రేరణ అందించే కంటెంట్ అందించాలని, మిర్చి తెలుగు కంటేంట్ లీడర్ వాణి మాధవి అవసరాల ‘మిర్చి పవరాన్’ సెగ్మెంట్ ని సృష్టించారు. దీనికోసం వివిధ రంగాల్లో ఎదిగిన లీడర్ల యొక్క చిన్ననాటి విషయాల నుంచి అనేక ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ షోని రూపొందించారు.  

మోటివేషనల్ స్పీకర్, మిర్చి ఆర్జే భార్గవి వ్యాఖ్యాతగా, ప్రతి శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఈ షో నిర్వహిస్తారు. అయితే, నవంబర్ 3న ప్రారంభమైన ఈ షోలో మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ షోని లాంచ్ చేశారు.  తెలుగు ఎంటర్టయిన్ మెంట్ రేడియో చరిత్రలోనే ఒక మంత్రి, ఒక అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేడియో షోలో అతిథి పాల్గొనడం ఇదే మొదటిసారి. 

కేటీఆర్ మిర్చి ఆఫీసులో అడుగుపెట్టగానే మిర్చి ఆర్జే స్వాతి ‘‘మనది హైద్రాబాదు… దేశంలో మనమే జోరు…మన కేటీఆరు…ఇగ సూడర జోరు’’ అంటూ ర్యాప్ సాంగ్ పాడి స్వాగతం చెప్పారు. ఈ పాట విన్న కేటీఆర్ సప్రైజ్ అవ్వడమే కాకుండా, ఆర్జే స్వాతిని, రైటర్ గణేశ్ తండ ని ప్రశంసించారు. తర్వాత ఆయన రేడియోలో మాట్లాడారు. తన బాల్యం నుంచి మొదలుపెడితే చిన్నప్పుడు తనేం కావాలనుకున్నారు? హైదరాబాద్ లో తనకు ఇష్టమైన ప్రదేశాలు, ఫుడ్ స్పాట్స్, కేసీఆర్ కి తనకు మధ్య ఉండే అనుబంధం ఇలా చాలా విషయాలు శ్రోతలతో పంచుకున్నారు. శ్రోతలు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రేడియోలో మాట్లాడటం వైబ్రేంట్ గా ఉందని చెప్పారు. మిర్చి పవరాన్ లాంటి అద్భుతమైన షో రూపొందించిన మిర్చి టీంని ఆయన ప్రశంసించారు. చాలామంది అతిథులు ఈ షోకి వచ్చి, శ్రోతలకు ఒక మోటివేషన్ , మెసేజ్ అందివ్వాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పారు.

ఈ సందర్భంగా మిర్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బిజినెస్ డైరెక్టర్ హర్మన్ జిత్ సింగ్ మాట్లాడుతూ… వినూత్న షోలు నిర్వహించడంలో మిర్చి ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటుందని, ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో మేమెప్పుడూ కృషి చేస్తుంటామని చెప్పారు. మిర్చి పవరాన్ షో కేటీఆర్ గారి చేతుల మీద లాంచ్ అవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒక టీం కష్టపడి పని చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, మిర్చి పవారాన్ షో మరింత మంది గొప్ప ప్రముఖులను మన ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా హర్మన్ జిత్ సింగ్ వివరించారు.

ఇంకేంటి? మిమ్మల్నిమీరు మరింత శక్తివంతగా మార్చుకోవడానికి, ప్రముఖుల జీవితం నుంచి స్ఫూర్తి పొంది ముందడగు వేయడానికి ప్రతి శుక్రవారం మిర్చి పవరాన్ షో కి ట్యూన్ అవ్వండి. ప్రతి శుక్రవారం… ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు. 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు.