ఇండియన్ ఐడల్_12 వ సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్!

సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్‌ మ్యూజికల్‌ షో ఇండియన్‌ ‘ఐడల్‌ సీజన్‌ 12’ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది.ఎన్నో ఆశలతో ఫైనల్‌ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు.
కాగా 12 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది.మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్‌ షో అర్ధరాత్రి వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు వీక్షించి ఆనందించారు. మొదటినుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షణ్ముఖ ప్రియ ఫైనల్‌ పోరులో ఆరో స్థానంలో నిలిచింది. షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌, నిహల్‌, సేలీ కంబ్లే, మహ్మద్‌ దనిష్‌ నిలిచారు.
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్‌లో విజేతగా పవన్‌దీప్‌ నిలిచాడు.

Optimized by Optimole