ఒక్క త్రో తో భారత్ స్టార్ ప్లేయర్ మూడు రికార్డులు..

జావెలిన్ త్రో ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మరోసారి అద్భుతం చేశాడు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఛాంపియన్ డైమండ్ లీగ్ మీట్‌లో 89.09 మీటర్లు జావెల్ విసిరి ఔరా అనిపించాడు. దీంతో ఒకేసారి మూడు రికార్డులను నీరజ్ బద్దలు కొట్టాడు.  లాసాన్ స్టేజ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలవడమే కాక.. సెప్టెంబరులో జ్యూరిచ్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు.. వచ్చే ఏడాది హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు నీరజ్ అర్హత సాధించాడు. 

ఇక నీరజ్  టోర్నీలో భాగంగా తొలి ప్రయత్నంలోనే 89.08 మీటర్లు జావెలిన్ విసిరాడు. ఇది అతని కెరీర్‌లో మూడో అత్యుత్తమ త్రో గా  నిలిచింది. .