‘డూఆర్ డై మ్యాచ్లో’ అదరగొట్టిన మిథాలీ సేన!

ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో డూ ఆర్ డై మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్​తో జరిగిన పోరులో మిథాలీ జట్టు 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణిస్తే.. బౌలింగ్​లో స్నేహ్​ రాణా 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారతజట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. యస్తిక భాటియా (50) అర్ధశతకంతో మెరిసింది. బంగ్లా బౌలర్లలో రితు మోని 3, నహిదా 2, జహనర అలమ్​ తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేధనలో బంగ్లా జట్టు.. భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్​ రాణా 4 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. పూజా వస్త్రాకర్​, జులన్​ గోస్వామి తలో 2 వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్​ ,పూనమ్​ యాదవ్​ ఒక్కో వికెట్​ పడగొట్టారు.