అనూష రెడ్డి(ఉస్మానియా యూనివర్సిటీ):
ఈ పుస్తకంలో కథలు చాలా బాగున్నాయి. నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన కథలు “కారు చెప్పిన కథ “, “ఉర్సు”.
కారు చెప్పిన కథ ఒక్క క్షణం నాకు కన్నీళ్లు పెట్టించింది…ఈ కథలో రచయిత చేపింది అక్షర సత్యం.. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ఆక్సిడెంట్ చాలు ఎన్నో జీవితాల్లో,ఆశలను , వల్ల ఆశయాలను, బంధాలను, భరోసా గా ఉన్న వాళ్లను దూరం చేసి కన్నీళ్లను మిగిలిస్తుంది.
ఉర్సు కథ కూడా చాలా నచ్చింది. అమ్మ కోసం ఆ పిల్లాడు ఎదురు చూడడం, అమ్మ కనపాడాగానే వాడి ముఖంలో నవ్వు రావడం చాలా నచ్చింది… మాకు నచ్చిన బొమ్మ కొంటే ఎంత ఆనందమో…ఆ రోజు అంత అ బొమ్మతో ఆడుకొని ఆనందంగా గంతులేస్తాం…
నాకు ఈ కథ నా చిన్న నాటి సంగతులను గుర్తు చేసింది. అమ్మ చిన్నప్పుడు ఊరువెళ్తే వచ్చేట్టప్పుడు నాకు ఏమి తేస్తుంది అని గుమ్మం దగ్గర ఎదురు చూడడం. ఏమైనా తీసుకోని వేస్తే కలిగే ఆనందమే వేరు..
పాప్ కార్న్ కథ చాలా బాగుంది. అర్జున్ రమ్య ప్రేమ కథ ఎంత బాగుందో అలాగే లాస్ట్ లైన్స్ లో నాన్న తెచ్చిన పాప్ కార్న్ చూసి ఆ చిన్నదాని ఆనందం … నాకే కలిగింది…
ఒకరిని మానం ప్రేమిస్తూ ఆ విషయాన్ని మనం మాటల్లో చెప్పలేక కొన్ని మనం వారి కోసం చేసే పనిలో చూపిస్తాం.
అవును నిజమే కొన్ని విషయాలు భాష, మాటల్లో కన్న కొందరు మౌనం సైగలో, చూపులో అర్థమవుతాయి. మాకు దగ్గరైన వాళ్లు ఒక్క చూపు చూస్తేతే చాలా వాళ్లు చెప్పాలి అనుకున్నది మనకు అర్థం అవుతుంది.
ఒకరిని ప్రేమించామంటే వాళ్ల దగ్గర నుంచి వచ్చే ప్రపంచాన్ని కూడా ప్రేమించాలి అలా ఉంటేనే వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.
ఈ ప్రపంచం మన కోసం ఎన్ని బంధాలు ఉన్న అందరు అందరితో అన్ని పంచుకోలేరు అన్నది వాస్తవం, అలా పెంచుకోవడానికి మనకంటూ ఒక మనిషి ఉంటే అది ప్రేమమైన,బాధైన,అలా ఎమోషన్స్ అయిన పంచుకునే వేసలుబాటు కొందరి దగ్గరే ఉంటుంది.
ఇప్పుడు ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో మనకంటూ ఒక మనిషి అలా ఉంటాం చాలా అరుదు
ఇప్పుడు మనుషులు ఏ ఎమోషన్ అయిన WhatsApp, Facebook insta story ద్వారా తెలియజేస్తూన్నారు. మనిషికి మనిషికి మధ్య బంధం పలుచబడి పోయింది . మానవ బంధాలు తగ్గిపోతున్నాయి.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమ్మ కథ
అమ్మ ప్రేమ అనంతం అంటారు. తల్లిదండ్రులకు మనమే జీవితం అన్నది వాస్తవం.
మనం బాధలో ఉన్నామో,సంతోషంలో ఉన్నామో, అని అందరి కంటే ముందు మన ముఖంలో , మాటల్లో కనిపెట్టెది ఒక అమ్మ మాత్రమే.. ఒక వయసు వచ్చే వరకు మన బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. కాని ఆ వయసు దాటాక మన బాధ ముఖంలో కనబడినా, మాటల్లో కూడా చెప్పుకోలేము అది నిజమే.. తల్లిదండ్రులు అడిగిన బాగునం అని చెప్పడం అలవాటు అవుతుంది. కాని వాళ్లకు తెలుస్తుంది మనం బాధలో ఉన్నామో,లేక ఆనందంలో ఉన్నామో.
మనకు నచ్చిన వాళ్లు మన పక్కనే ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. అది ఒక విషయం అయితే వాళ్ళు ఏవైనా కారణాల వలన మనకు అంతే బాధ కూడా మనతో మిగిలిపోతుంది.
ఇరానీ కేఫ్ కథలో ఒక రచయిత imaginary ప్రపంచంలో ఒక కథను ఎలా ఉహింకుంటాడో, ఆ పాత్రల ద్వారా కథకు ఎలా ప్రాణాం పోస్తాడో ఆ కథకు ఎలా శిల్పాన్ని తిరిచిదిదుతాడో ఈ కథ తెలుపుతుంది. అవును నిజమే ఒక కథ రాయాలి అంటే కథ అంశం , పాత్రల, భాష చాలా అవసరం. ఆ కథ రచయిత తనకు జరుగుతుంది అని ఆ క్షణం ఆ కథలో జీవిస్తే తప్ప కథ మన మనసుకు ఆ సంతోషాన్ని అనుభూతిని ఇవ్వదు.
ఇలా మాట్లాడుకుంటూపోతే ఈ పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి… మనిషి జీవితంలో ఎదురైయో సంఘటనలు, , ఎదురైయో వ్యక్తులు వాళ్ళతో మనకు మధ్య ముడి వేసుకున్న బంధాలు, వాళ్లతో కలిసి గడిపిన జ్ఞాపకాలు , అవి గుర్తు చేసుకుంటే కొన్ని పెదాల పై చిరునవ్వును పుయిస్తాయి. కొన్ని జ్ఞాపకాలు గుండెలో మోయలేనంత బాధను గుండె పై బరువును పెంచుతాయి.. జీవితంలో ఏది జరిగిన మరుసటి రోజు అది గతంగా మారుతుంది… అ గతం కొన్ని మంచి జీవన సుక్తులను నేర్పిస్తుంది… ఆ గతం దగ్గర ఆగిపోవడం కంటే… అందులో నుంచి బయటపడి ఓ మంచి జీవితాన్ని మొదలు పెట్టడం మనకు, మనతో ఉన్న వారికి చాలా ఆనందాన్ని ఇస్తూంది.
ఈ పుస్తకాన్ని రాసిన మీకు నా ధన్యవాదాలు..