తెలుగు చిత్ర సీమకు ఆయనొక శంకరాభరణం.. స్వయం కృషితో ఎదిగిన స్వాతి ముత్యం.. సాంప్రదాయానికి పెద్ద పీట వేసిన స్వాతి కిరణం.. చిత్ర సీమలో సౌండ్ ఇంజనీర్ గా మొదలైన ఆయన ప్రస్థానం.. దర్శకుడు.. నటుడు..రచయితగా మెప్పించి..కళా తపస్విగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు ఆయన లేరన్న వార్తతో యావత్ సినిలోకం శోక సంద్రంలో మునిగిపోయింది.ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
జననం…
గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19 న కె. విశ్వనాథ్ జన్మించారు. కాశీనాధుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతుల సంతానం. ప్రాథమిక విద్య గుంటూరులోనే సాగినా.. ఆతర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మకాం మార్చింది.
గుంటూరు హిందూ కాలేజీలో ఇంట
ర్మీడియట్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీపూర్తి చేశారు. ఆ ఆతర్వాత చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా సినీ కెరీర్ ప్రారంభించారు.
ఇక 1965 లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.’ సిరిసిరిమువ్వ ‘ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. దర్శకుడిగా 51 సినిమాలు తెరకెక్కించిన కళా తపస్వి.. నటుడిగా అతడు,శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా ..తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు.
అవార్డులు…..
శంకరాభరణంతో జాతీయ పురస్కా
రాన్ని దక్కించుకున్నాడు.2016 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు అదే సంవత్సరంలోనే పద్మశ్రీ కూడా అందుకున్నాడు.10 ఫిలింఫేర్ అవార్డులు, ‘సాక్షి’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకోవడం విశేషం.