Swetha vadlakonda: అందరూ కల్కి 2898 ఏడీ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి.. నేను నా ఊహకు పనిచెప్పి ఒక చిన్న కథనం రాద్దామనుకుంటున్నా.
కల్కి సినిమా సందర్భం : మూడో ప్రపంచ యుద్ధం పూర్తయ్యి ప్రపంచమంతా నాశనమైంది. కులాలు, మతాలు నశించిపోయాయి. దైవం అనే అంశం కనుమరుగైపోయింది. ఆ యుద్ధం జరిగేందుకు సుప్రీమ్ యస్కిన్ అనే అతను అన్ని దేశాలకు సహాయం అందించాడు. ఆ తరువాత కాంప్లెక్స్ అనే దానిని తయారు చేశాడు.
యుద్ధం వల్లనే కాకుండా మానవ దురాశ కారణంగా ప్రకృతి వినాశం జరిగింది. అది ఎంతలా అంటే కాశీ గంగ కూడా ఎండిపోయింది. హిమాలయ సానువుల్లోని శంబల నగరంలో నీటి కొరత ఏర్పడింది. అయితే కాంప్లెక్స్ కర్త అయిన సుప్రీమ్ యస్కిన్ మాత్రం తాను రూపొందించిన మరో ప్రపంచంలోకి మిగిన సహజవనరులను పీల్చేశాడు. అందులో ప్రవేశానికి రుసుమును పెట్టాడు. అంటే ధనికులకు మాత్రమే అందులో నివాసం అన్నమాట. అందులోనూ తమ జాతి మాత్రమే ఉత్తమమైనదని భావించే వారే అందులో ఉంటారు. మిగిలిన వారు బానిసలకంటే హీనం.
ఇక ఆ సుప్రీం తాను అమరుడై శాశ్వతంగా భూమిని పాలించాలని నిర్ణయించుకొని అందుకు తగిన ఔషధం కోసం ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ అతను సాధించేవన్నీ కూడా అధర్మ ప్రభావం చేతనే. కావున కల్కీ అవతారానికి సమయం ఆసన్నమైందని నమ్ముతారు శంబలవాసులు. అదే సుమతికి పుట్టబోయే బిడ్డ. ఇక దాని చుట్టూ కథనం తిరుగుతుంది.
ఇక్కడ భైరవగా నటించిన ప్రభాస్ ను : కర్ణుడిగా చూపించారు. కురుక్షేత్రంలో కూడా క్షత్రియుల్లో కలవాలనే కలతో కురుక్షేత్ర యుద్ధానికి దారి తీశాడు కర్ణుడు. ఈ సినిమాలో కూడా కాంప్లెక్స్ కు వెళ్ళాలనే స్వార్థంతోనే సుమతిని సుప్రీమ్ కు ఇవ్వాలని పోరాడాడు భైరవుడు. అంటే యుద్ధం మరింత తీవ్రమవ్వడానికి కారణం నాడు కర్ణుడైతే, కల్కీ సినిమాలో భైరవుడు అన్నమాట. ఏదైనా లోక కల్యాణానికే కాబట్టి కల్కీ ఆడిస్తున్న ఆటగా మనం భావించవచ్చు.
మరి పాస్టర్లు, ఇమాంల మాదిరి వచ్చేది దేవుడొక్కడే ప్రపంచమంతటికి అనే డైలాగుల విషయానికి వస్తే. ప్రపంచ నాశనం కాబోయేది ఆ రెండు మతాల కారణంగానే అని మనం అర్థం చేసుకోవచ్చు. నేటికి ఆయా మతాలు బలంగా ఉన్న దేశాల్లో పరిస్థితులను కావాలంటే పరిశీలించుకోవచ్చు. అందుకే ఆ విషయాన్ని చాలా సింబాలిక్ గా చెప్పేలా పాస్టర్లు, ఇమాంల భాషను వాడారు.
మహాభారతం సంఘటనలను ఎందుకు ప్రస్తావించారు?
అధర్మం పెచ్చరిల్లి ధర్మగ్లాని జరుగుతున్నప్పుడు యుద్ధం అనివార్యం. అశ్వథామకు శాప విమోచనం కోసం కల్కీ అవతారానికి రక్షణ అనే కల్పితం మనం అర్థం చేసుకోవచ్చు. మరి కర్ణుడి పాత్ర సంగతేంటి అంటారా? స్వార్థం కోసం యుద్ధానికి దారి తీసి సుప్రీమ్ అనే వాడి అంతానికి దారులు వేస్తాడు భైరవ. అది జగన్నాటక సూత్రధారి ఆట. కాకపోతే కలియుగం కాబట్టి ఇక్కడ అర్జునులు తక్కువగా ఉంటారు. స్వార్థపరులైన కర్ణులే ఎక్కువ ఉంటారు అనేది కథా రచయిత వ్యక్తిత్వాన్ని నిర్మిస్తే దర్శకుడు దాన్ని భైరవ రూపంలో సింబాలిక్ గా చూపించాడు. కావాలంటే పరిశీలించుకోవచ్చు భైరవ, కర్ణుడి పాత్రలను సరిపోల్చుకోని.
మిగిలిన పాత్రలు దైవం అనే నమ్మకం సన్నగిల్లినప్పుడు కలి ప్రభావం చేత ఎలా మారుతారనే దానికి ప్రతిబింబాలు..
ఇక చివరగా… ప్రపంచమంతా ప్రళయం వచ్చినా కాశీ నగరం మాత్రం నీట మునగదని ప్రతీతి. అందుకే కాశీ కేంద్రంగానే కాంప్లెక్స్ ఆకాశంలో నిర్మించారు. గంగను ఆకాశానికి తీసుకెళ్తూనే ఉన్నారు. కాశీలోనే జనాలు బ్రతికారు.
PS: కల్కి 2898 ఏడీ విశ్లేషించుకునే వారికి మానవులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల వైపు ప్రయాణిస్తున్నారో అర్థం కావొచ్చని ఇంత వివరణాత్మకంగా రాశాను.