Kanguvareview:
విలక్షణ నటుడు సూర్య(suriya) తాజాగా నటించిన చిత్రం కంగువా( kanguva). హాట్ బ్యూటీ దిశా పటాని( Dishapatani )హీరోయిన్గా నటించిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ కి బాహుబలి.. కోలీవుడ్ కి కంగువా అంటూ చిత్ర బృందం ప్రచారం చేయడంతో సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయి. సూర్య కెరియర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం..!
కథ:
ఫ్రాన్సిస్ ( సూర్య) గోవాలో బౌంటీ హంటర్ గా పనిచేస్తుంటాడు.తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఏంజెలీనా(దిశాపటాని) కూడా ఇదే పని చేస్తూ అతనికి పోటీగా ఉంటుంది. ఫ్రాన్సిస్ తన స్నేహితుడు ( యోగి బాబు)తో బౌంటీ హంటింగ్ చేస్తుండగా జీటా అనే బాలుడు తారసపడతాడు. జీటాను చూడగానే అతనికి తనకు ఏదో సంబంధం ఉందన్న భావన ఫ్రాన్సిస్ లో కలుగుతుంది.ఇంతలో బాలుడికి ప్రాణహాని ఉందని ఫ్రాన్సిస్కి తెలుస్తుంది. ఇంతకు జీటా ఎవరు? అతనిని చంపాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? జీటాకి – ఫ్రాన్సిస్కి – 1070 సంవత్సరాల నాటి ప్రణవ కోణ యువరాజుకి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే…?
వెయ్యిళ్ల కిందటి జానపద కథకు..నేటి కాలానికి ముడి పెడుతూ దర్శకుడు శివ కంగువా(kanguva)ను తెరకెక్కించాడు. సినిమా కథ.. ప్రణవ కోన, కపాల కోన, సాగర కోన, అరణ్య కోన, హిమ కోన అనే ఐదు వంశాల కథ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ పరంగా సినిమా పరవాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్ పరంగా బాగుంది. సినిమాలో అక్కడక్కడ వచ్చే సన్నివేశాలు బాహుబలి సిరీస్ ను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రధాన పాత్రలైనా.. కంగువా – పులువ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్. అతిథి పాత్రలో నటించిన హీరో కార్తీ ( Karthi)పాత్ర సినిమాకు అదనపు బలం.
ఎలా చేశారంటే..?
మరోసారి ద్విపాత్రాభినయ( కంగువా, ఫ్రాన్సిస్)నటనతో సూర్య( suriya) ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. మొత్తంగా వన్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు. అతిథి పాత్రలో కార్తీ ఎప్పటిలానే తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కు ప్రాధాన్యమున్న పాత్రలో మెరిశాడు . హాట్ బ్యూటీ దిశా పటాని( Dishapatani).. అందం అభినయం పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. యోగి బాబు, కోవై సరళ తమదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రలు పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతికంగా:
దర్శకుడు శివ తన చెప్పాలనుకున్న కథను ప్రజెంట్ చేయడంలో కొంతమేర విజయం సాధించాడు. కథనం, పాత్రల పరంగా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. సంగీతం పరవాలేదు. రెండు, మూడు పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతమని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. టాలీవుడ్ బాహుబలిని కొట్టే ప్రయత్నంలో కంగుతిన్న కోలీవుడ్ కంగువా..!
రివ్యూ: 2.75/ 5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)