కర్ణాటక కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే యడియూ రప్ప శిష్యుడు బసవరాజ్ బొమ్మై ని ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. సీఎం ఎంపికపై సమావేశమైన కర్ణాటక శాసన సభా వర్గం.. మాజీ సీఎం యడియూరప్ప బసవరాజు సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే అందరూ ఆమోదించడం.. ప్రకటన చక చక జరిగిపోయింది.
ప్రస్థానం ..
ప్రస్తుతం బొమ్మై కర్ణాటక హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు బొమ్మై బసవరాజు.. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కూమారుడు..యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు. బొమ్మై 1960 జనవరి 28న హుబ్లీలో జన్మించారు. ప్రస్తుతము ఆయన వయసు 61 ఏళ్లు. భార్య: చెన్నమ్మ బి. బొమ్మై. తండ్రి ఎస్ఆర్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి, తల్లిగంగమ్మ ఎస్ బొమ్మై. ఆయనకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బోమ్మై బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
రాజకీయ ప్రస్థానం..
కళాశాలలో చదువుకునే రోజుల్లోనే జనతా దళ్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు బసవరాజు బొమ్మై. 1995లో జనతా దళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1996-97 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జేఎచ్ పటేల్.. బసవరాజ్ను రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు.
1998, 2008లో ధారవాడ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. 2007లో ధారవాడ నుంచి నరగుండ వరకు 232 కిలోమీటర్లు రైతుల కోసం పాద యాత్ర చేశారు. అనంతరం 2008లో భారతీయ జనతా పార్టీలో చేరారు.
2008లో షిగ్గాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.2008 జూన్ 7- 2013 మే 13 వరకు జలవనరుల మంత్రిగా విధులు నిర్వహించారు.
2019 సెప్టెంబర్ 27 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకు రాష్ట్ర సహకార మంత్రిగా పనిచేశారు. 2019 ఆగస్టు 26 నుంచి 2021 జులై 26 వరకు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. హవేరి, ఉడుపి జిల్లాలకు కూడా బాధ్యత వహించారు బొమ్మై. రైతుగా, వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన నీటిపారుదలపై అపారాజ్ఞానం సంపాదించారు. దేశంలో తొలిసారిగా షిగ్గావ్ ప్రాంతంలో 100శాతం నీటిపారుదల ప్రాజెక్టును విజయవంతం చేశారు.
గొప్ప మనసున్న నేత..
బసవరాజ్ బొమ్మై గొప్ప మనసున్న నేత. కరోనా రెండో దశలో ఆయన చేసిన సేవ ఇందుకు ఉదాహరణ. కర్ణాటకలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు వెలుగుచూసిన మే నెలలో.. హోం మంత్రి బసవరాజ్ బొమ్మై తన నివాసాన్నే కొవిడ్ కేర్ సెంటర్(సీసీసీ)గా మార్చారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక మంత్రి తన నివాసాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చినట్లు ఆయన కార్యాలయం ఓ తెలుగు ప్రధాన పత్రిక పేర్కొంది.