విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్!

వ్యాపార వేత్త పరారిలో ఉన్న విజయ్ మాల్యాకు బ్రిటన్​ కోర్టు షాక్​ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన లండన్ హైకోర్టు.. ఖాతాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జడ్జి మైఖేల్ బ్రిగ్స్ ఉత్తర్వులు జారీ చేశారు.

మాల్యా ఆస్తుల నిలిపివేతకు సంబంధించిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ అతని తరుపు న్యాయవాది ఫిలిప్​ మార్షల్​ కోరారు. దీనిపై స్పందించన న్యాయమూర్తి.. మాల్యా అభ్యర్థనలను తిరస్కరించారు. నిర్ణీత కాల వ్యవధిలో తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని.. లేకపోతే అందుకు తగిన సాక్ష్యాలు చూపించాలని కోరారు.