తెలంగాణలోని సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: సిఎల్పీ భట్టి విక్రమార్క

Tcongress: పీపుల్స మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి మా పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. మా బతుకులు అగమవుతున్నాయి. తినేందుకు తిండి కూడా సంపాదించలేకపోతున్నాం. గీతం కార్మికులు మొత్తంగా చెట్లు ఎక్కడం బంద్ చేసే రోజులు వచ్చాయి. మేము చాలా కష్టాల్లో ఉన్నాము. మాకు ఇన్సూరెన్స్ కూడా కావాలని చెప్పారు. మట్టా అంజవ్వమాట్లాడుతూ.. మా ఊరికి ఏమీ రావడం లేదు. ఎవరు వచ్చినా ఏమీ చేయడం లేదు. కూలీ చేసుకుని బతుకుతున్నాం. మేము బతికినా ఒక్కటే చచ్చినా ఒక్కటే. ఫింఛన్లు కూడా ఇవ్వడం లేదు. కనీసం వంద రోజులు పని ఇయ్యడం లేదు.. చేసిన పనికి బ్యాంకులో డబ్బులు వెయ్యడం లేదు. మేమెట్లా బతకాలని ఆవేదనగా చెప్పింది.

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న మాకు ఈ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ ప్రేమాభిమానాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. నేను ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీలను, గిరిజనులను, బొగ్గుబాయిల్లో పనిచేస్తున్న కార్మికులను, కాకాతీయ విద్యార్థులను, వరంగల్-హన్మకొండ ప్రజలతో మాట్లాడుతూ ఇక్కడకు వచ్చాను. సాధ్యమైనంత వరకూ ప్రతిగ్రామంలో ప్రజలతో మాట్లాడుతున్నాను. దశాబ్దాల పోరాటాల తరువాత తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ అన్నీ వస్తాయనుకున్నాం. కానీఎవ్వరికీ ఏమీ రావడం లేదని ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు రావడం లేదు. నిధులు ప్రభుత్వ పెద్దలే దోచేస్తున్నారు. ఆత్మగౌరవం లేకుండా పోయింది. భూమిని పంచడం లేదు. నిరుపేదల జీవితాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మిగులు బడ్జెట్ తో తెచ్చుకున్న రాష్ట్రం అప్పులపాలైందని భట్టి ఆవేదన వ్యక్తంచేశారు.

 

 

 

Optimized by Optimole