కేసీఆర్ రేపు ఆస్పత్రి నుండి డిశ్చార్జి?

kcrhealth: తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.ఈ మేరకు వైద్యులు అవ సరమైన ఏర్పాట్లు చేస్తు న్నట్లు తెలిసింది. గత గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడడంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయ మైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కెసిఆర్ ఆస్పత్రిలో తన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.