Appolitics: అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళ్లాలని కోటంరెడ్డి నిర్ణయం

అమరావతి: నెల్లూరు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం జరగనున్న ఏపీ  అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా  వెళ్లాలని ఆయన నిర్ణయించారు. నియోజకవర్గం లో‌ని సమస్యల  ప్ల కార్డుల ను ప్రదర్శిస్తూ వెలగపూడి లోని మారుతి సుజికీ షోరూమ్ నుండి అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్ర వెళ్లాలని కోటం రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండటంతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు.

కాగా రెండు నెలల క్రితం కోటం రెడ్డి వైసీపీ పార్టీపై తిరుబావుట ఎగరేశారు. అధికార వైసీపీ నేతలు.. క్యాడర్ సైతం మీ వెంటే మేము అంటూ ఎమ్మెల్యే కు మద్దతుగా నిలిచారు. కోటంరెడ్డి పార్టీని వీడటంతో నెల్లూరు రూరల్ లో వైసీపీ పార్టీ కోమాలోకి వెళ్ళిపోయింది. రానున్న ఎన్నికల్లో ఈ నియోజక వర్గం వైసిపి కి పెద్ద దెబ్బగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

 

Optimized by Optimole