IncTelangana: సమాజంలో మీరు చూడాలనుకున్న మార్పులో ముందు మీరు పాత్రధారులు కావాలి అన్న మహాత్మ గాంధీ మాటల ప్రేరణతో యువతలో అసలైన పార్లమెంటేరియన్‌ను మేల్కొలిపే ప్రయత్నం మొదలుపెట్టామని కాంగ్రెస్ సిటిజన్ యూత్ పార్లమెంట్ వింగ్ పేర్కొంది. ఈ మార్పు, పరివర్తనలో యువతను మరింత శక్తివంతం చేసేందుకు సిటిజన్ యూత్ పార్లమెంట్ ఒక వేదికగా మారుతుందని.. మొదటి ఎడిషన్ కర్ణాటకలో విజయవంతంగా పూర్తి చేసి.. ఇప్పుడు తెలంగాణాలో 2వ ఎడిషన్ తీసుకొస్తున్నామని తెలిపింది. యంగ్ స్టేట్‌లో ఈ ఎడిషన్‌ను సెప్టెంబర్ 29, 30 & అక్టోబర్ 1న మీ మీందుకు తెస్తున్నట్లు.. పార్లమెంట్‌లో అడుగుపెట్టే ముందు మొదటి అడుగు వేయడానికి సిటిజన్ యూత్ పార్లమెంట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని వివరించింది.18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులందరూ ఈ యూత్ పార్లమెంటులో పాల్గొనవచ్చని.. అభ్యర్ధి సీట్ కన్ఫర్మ్ చేసుకోడానికి , Google ఫాం నింపి సబ్‌మిట్ చేయండని సూచించింది. సంస్థ నిపుణుల బృందం నిర్వహించే ఇంటర్వ్యూను ఎదుర్కోండని .. ఆ తర్వాత సిటిజన్ యూత్ పార్లమెంటులో పాల్గొనండని పిలుపునిచ్చింది.న్యూఢిల్లీలో జరిగే నేషనల్ లెవెల్ యూత్ పార్లమెంటులో పాల్గొనే అవకాశం కూడా యువత చేతుల్లోనే ఉందని.. యూత్ పార్లమెంట్‌లో అద్భుతంగా మాట్లాడినవారిని.. మెరుగైన ప్రతిభ కనబర్చినవారిని ఎంపిక చేసి గ్రాండ్ వ్యాలిడక్టరీ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది.