Poetry:
నిన్నను క్షమించేద్దాం
రేపటి రోజును
నాశనం చేసే అవకాశాన్ని
నిన్నకు ఇవ్వొద్దు.
బాస రూపుమాసిపోతుంది.
గొంతు ఊగిసలాడుతుంది.
రాలిన ఆకుల చప్పుళ్లతో
చెవులు గింగురుమంటుంటాయి.
పొద్దు పొడిచే లోపే
అవకాశానికి ఆటంకం ఎదురవుతుంది.
నిన్నటి రోజును
దాని మానాన గడచిపోనిద్దాం.
కాలజాలంలోని కలనేతను
కాసింత సడలించుదాం.
రేపటి రోజును
అదుపు చేయవద్దని
నేటిని వేడుకుందాం.
వెనుదిరిగి చూడనే చూడొద్దు.
ఇక నిన్ను నడిపించేది
నీ సంకల్పమే!
—
బాస్క్ మూలం: వీ ఫ్లమింగో
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు