మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ ‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ ‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ . విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మద్రాస్​ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ అత్యంత​భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ప్రస్తుతం పార్ట్_1 షూటింగ్ చివరి దశలో ఉన్న తరుణంలో చిత్ర బృందం విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్​ 30న ‘పొన్నియన్​ సెల్వన్’​ పార్ట్​ 1ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాక ఈ సినిమా లో నటిస్తున్న ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తీ ఫస్ట్ లుక్ల్ను రిలీజ్​ చేశారు మూవీ మేకర్స్‌. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా తమిళంతోపాటు మరో నాలుగు భాషల్లో విడుదల కానున్న పొన్నియన్‌ సెల్వన్‌ మూవీకి.. ఆస్కార్ గ్రహీత ఏఆర్​ రెహమాన్​ సంగీతం అందిస్తున్నారు. కెమెరా మెన్‌గా ర‌వి వ‌ర్మన్‌, ఎడిట‌ర్‌గా శ్రీక‌ర్ ప్రసాద్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.