Bachchanreview: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. మాస్ మహారాజ్ హిట్ కొట్టినట్టేనా..?

MrBachchanreview:  మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకుడు . కథనాయికగా భాగ్యశ్రీ బోర్సే ఈచిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. మాస్ కాంబోలో తెరకెక్కిన ఈమూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇంతకు ఈచిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!!

కథ:  మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటాడు. అవినీతి ప‌రుడైన ఓ వ్యాపారి ఇంటిపై బ‌చ్చ‌న్ రైడ్ చేయడంతో ఆగ్రహించిన అధికారులు అతనిని సస్పెండ్ చేస్తారు. దీంతో అత‌ను త‌న సొంతూరు కోటిపల్లికి వ‌స్తాడు.అక్క‌డే జిక్కి(భాగ్య‌శ్రీ)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అంతలోనే అత‌నిపై సస్పెన్ష‌న్ ఎత్తేయ‌డంతో జిక్కితో పెళ్లికి రెడీ అవుతాడు. నాలుగు రోజుల్లో పెళ్లి అన‌గా.. ఎంపీ ముత్యం జ‌గ్గ‌య్య‌(జ‌గ‌ప‌తిబాబు) ఇంటిపై రైడ్ చేయాల్సి వ‌స్తుంది. ఇంత‌కు బ‌చ్చ‌న్ – జిక్కి పెళ్లి జ‌రిగిందా? ఎంపీ ఇంటిపై రైడ్ కి వెళ్లిన బ‌చ్చ‌న్ కి ఎదురైన ప‌రిస్థితులు ఏంటి? తెలియాలంటే  సినిమా చూసి తీరాల్సిందే..!

ఎలా ఉందంటే..??
బాలీవుడ్ రెయిడ్ సినిమా రీమేక్ గా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తెర‌కెక్కింది. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న మార్క్ మాస్ ట‌చ్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఫ‌ర్వాలేదు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సినిమా సాఫీ గా సాగిపోతుంది. సెకాండాఫ్ లో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. జ‌గ‌ప‌తిబాబు, ర‌వితేజ్ మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు మాస్ ఆడియోన్స్ ని మెప్పిస్తాయి. ద్వితీయార్థం ఓకే అని చెప్ప‌వ‌చ్చు. కామెడీ సోసో, పాట‌లు ఆక‌ట్టుకున్నాయి.

ఎలా చేశారంటే..?
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌ బ‌చ్చ‌న్ పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. స్టైలిష్ యాక్ష‌న్ తో మెప్పించాడు. భాగ్య‌శ్రీ బోర్సే తొలిసినిమా అయిన అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. విల‌న్ గా జ‌గ‌ప‌తి బాబు మ‌రోసారి న‌ట‌విశ్వ రూపం చూపించాడు. మిగ‌తా న‌టీన‌టులు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.

సాంకేతికంగా…

మాస్ ఆడియోన్స్ ను దృష్టిలో పెట్టుకుని మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ను తెరకెక్కించాడు దర్శకుడు హ‌రీష్ శంక‌ర్. కథనం పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.సంగీతం బాగుంది. నేప‌థ్యం సంగీతం సినిమాకు హైలెట్‌. సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

‘ఒక్క మాట‌లో చెప్పాలంటే.. మాస్ మహారాజ్ అభిమానుల‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా..!’

రివ్యూరేటింగ్‌;  2.75/ 5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)