Doubleismart: హీరో రామ్ – పూరి జగన్నథ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్‌శంకర్ (ismartshankar) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రామ్ కెరీర్ లో ఆమూవీ హయస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ తర్వాత అతను నటించిన ఏ సినిమా కూడా ఆరేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఇటు పూరిజగన్నథ్ సైతం పాన్ వరల్డ్ గా తెరకెక్కించిన లైగర్ డిజాస్టర్గా మిగిలింది. దీంతో మరోసారి జోడి కట్టిన వీరిద్దరూ డబుల్ ఇస్మార్ట్(Doubleismart)తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా విడుదలైన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!
కథ: బిగ్ బుల్(సంజయ్‌దత్)మాఫియాడాన్. తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉంటాడు. “తానోటి తలిస్తే దైవం మరోటి తలిచిదన్నట్లు” బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉందని.. మూడు నెలలకంటే ఎక్కువ బతకవని అతనికి డాక్టర్లు చెబుతారు. దీంతో ఎలాగైనా బతకాలని బిగ్ బుల్ విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. అనుకోకుండా అతనికి సైంటిస్ట్(మకరంద దేశ్ పాండే)తారసపడి.. మెమరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా మరణం లేకుండా జీవించవచ్చని సలహాఇస్తాడు. బతకాలన్న ఆశతో బిగ్ బుల్ అనేకమంది మీద ఈప్రయోగం జరిపించి ఫెయిల్ అవుతాడు. ఈక్రమంలోనే ఈప్రయోగం సక్సెస్ అయిన ఇస్మార్ట్‌శంకర్ (రామ్ పోతినేని)హైదరబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుంటాడు. అతనని పట్టుకొచ్చి తనకి మెమరీ ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాడు. ఆతర్వాత ఏమైంది? ఇస్మార్ట్ శంకర్, బిగ్ బుల్ గా మారాడా? లేదా? ఇస్మార్ట్ శంకర్ తల్లికి, బిగ్ బుల్ కి సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే..!
ఎలా ఉందంటే..??
ఇస్మార్ట్ శంకర్ మూవీ కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కింది. మొదటి పార్ట్ వలే ఇందులోనూ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, యాక్షన్ కి తోడు సెంటిమెంట్ ను జోడించాడు దర్శకుడు పూరిజగన్నాథ్.ఫస్ట్ ఆఫ్ పరంగా సినిమా బాగుంది.యాక్షన్ సీక్వెన్స్,రామ్- కావ్యథాపర్ లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. సెకండాఫ్ ఓకే అనిచెప్పవచ్చు. ద్వితీయార్థంలో హీరో,విలన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి.క్లైమాక్స్ సోసోగా అనిపిస్తుంది. ‘మార్ ముంతా చోడ్ చింతా‘ పాట సినిమాకే హైలెట్.
ఎవరెలా చేశారంటే..??
హీరో రామ్ పోతినేని సినిమాకు ప్రాణం పెట్టాడు. హీరోయిన్ కావ్యాథాపర్ ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మెప్పించింది. సంజయ్ దత్ లాంటి హీరోకు బిగ్ బుల్ పాత్ర సరైంది కాదేమో అనిపిస్తుంది.మిగతానటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
దర్శకుడు పూరిజగన్నాథ్ ఎంచుకున్న పాయింట్ మెచ్చకోదగినది. తాను చెప్పాలనుకున్న ఐడియా మంచేదే అయినా.. కథనం పరంగా తేడా కొట్టేసింది. మణిశర్మ సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం ఒకే.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. పూరి మార్క్ లేని ‘డబుల్ ఇస్మార్ట్’..
రివ్యూ రేటింగ్: 2.5/ 5(సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది.)