Msdhoni: టీంఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బైచెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం మాట్లాడిన ధోని.. రెండేళ్ల తర్వాత అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా పట్ల ప్రేక్షకులు చూపే అభిమానం, అప్యాయతకు రుణపడి ఉంటాం.. కెరీర్ లో ఇదే నాచివర దశ అంటూ మహీ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. ఐపీఎల్ 2023 టోర్నమెంట్ ముగిసిన వెంటనే .. క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఐపీఎల్ టోర్నీ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అగ్రపథాన నిలబెట్టిన ఘనత ధోనికే దక్కుతుంది. టోర్నీలో ఏ జట్టుకు సాధ్యంకానీ రికార్టులు మహీ సారథ్యంలో చెన్నై సాధించింది. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా ధోని సైతం అనేక రికార్టులను కొల్లగొట్టాడు.
ఇదిలా ఉంటే.. చెన్నై జట్టు అభిమానులు ఆరాధ్య ఆటగాడిగా భావించే ధోనిని ముద్దుగా తల అని పిలుచుకుంటారు. ఈనేపథ్యంలో మహీ రిటైర్మెంట్ పై వార్తలపై ప్రచారం కావడంతో సోషల్ మీడియా వేదికగా.. తలను ఎల్లో జెర్సీలో చూడాలన్నది చెన్నై అభిమానుల ఆకాంక్ష. ఐపీఎల్ అభిమానులు సైతం మహీ ఆటకోసం పరితపిస్తారు. అతను గ్రౌండ్ లో దిగాడంటే టీఆర్‌పీ రేటింగ్స్ సరికొత్త రికార్డులు నమోదవుతాయి. అలాంటిది తల రిటైర్మెంట్ పై వార్తలు మరోసారి వైరల్ కావడం మనసును కలిచివేసింది అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.