యువతరం గళం వినిపించేందుకు సరైన వేదిక ‘యువశక్తి’: నాదెండ్ల మనోహర్

జనసేన ‘యువశక్తి’ కార్యక్రమం యువతరం గళం వినిపించేందుకు సరైన వేదికన్నారు ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. స్వామి వివేకనంద జయంతి రోజున నిర్వహించే ఈ సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఉత్తరాంధ్ర యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇక్కడి ప్రజల బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదన, ఉద్దానంలో ఆరోగ్య క్షీణత.. ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన విజయగాధలు అందరికీ తెలిపేలా యువశక్తి చక్కటి వేదిక కాబోతోందన్నారు.

ఇక యువశక్తిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని నాదెండ్ల స్పష్టం చేశారు. దీనికి పార్టీ తరఫున ప్రత్యేకమైన ఫోన్ నంబరు.. ఈ – మెయిల్ ఐడీ కేటాయించామన్నారు. వాయిస్ రికార్డర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలని అనుకుంటున్నారో క్లుప్తంగా రికార్డు చేసి చెప్పవచ్చన్నారు.అంతేకాక ఈ – మెయిల్ కు తగిన వివరాలను పంపవచ్చన్నారు. మొత్తం వివరాలను పరిశీలించిన పిమ్మట పార్టీ కార్యాలయం నుంచి తగిన సమాచారం వస్తుందని వెల్లడించారు. పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు  080 69932222, ఈ– మెయిల్ vrwithjspk@ janasenaparty.org కు వివరాలను పంపాలని కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మనోహర్ తాజాగా విడుదల చేశారు

Related Articles

Latest Articles

Optimized by Optimole