BIGALERT:ఆడవాళ్లు ఏ బట్టలేసుకుంటే నీకెందుకురా కుయ్యా?
BIGALERT: మొత్తం చదవండి. చాలా విలువైన, కీలకమైన అంశం. మరీ ముఖ్యంగా మగవాళ్లంతా చదవండి. బెంగళూరు నగరంలోని ‘Etios Digital Services’ అనే సంస్థలో పనిచేస్తున్నాడు నిఖిత్ శెట్టి. హాయిగా పనిచేసుకుంటూ ఉంటే సమస్య లేదు. ఖ్యాతిశ్రీ అనే వివాహితపై అతని దృష్టి పడింది. ఆమె వేసుకునే బట్టల మీద ఆ దృష్టి మరింత పడింది. ఆమె మీద వ్యక్తిగత కక్షో, లేక ఆమె బట్టలు కర్ణాటక రాష్ట్ర సంప్రదాయానికి అనువుగా లేవన్న ‘మతాధిపతి’ మనస్తత్వమో, ఆడవాళ్లు…
mirchi: బతుకమ్మ స్పెషల్ ర్యాప్ విడుదల చేసిన మిర్చి..!
Mirchi: బతుకమ్మ అంటేనే పాటల పండగ. ఆటల వేడుక. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మిర్చి తెలుగు వినూత్నరీతిలో బతుకమ్మ ర్యాప్ సాంగ్ విడుదల చేసింది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే రకరకాల పూలు, బతుకమ్మ ప్రత్యేకత, బతుకమ్మ చరిత్ర, బతుకమ్మ సమయంలో ఉండే అనుబంధాలను కలపోతగా ఈ పాటను రూపొందించారు. మోడ్రన్ మ్యూజిక్, తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటను మిర్చి స్వాతితో ఫ్లవర్ మార్కెట్ లో చిత్రీకరించారు. కాగా, ఈ పాటను సద్దుల బతుకమ్మ నాడు…
Karimnagar: దుర్గాదేవిగా అమ్మవారు.. జోరువానలో మహిళల బతుకమ్మ..!
Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం( ఎనిమిదోవ రోజు) అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు….
EENADU: శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’రాస్తే ఎలా?
Nancharaiah merugumala senior journalist: హరియాణా ‘చౌధరీ’ గారమ్మాయి శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’ కూడా రాస్తే ఎలా? ఇది చిత్తూరు నాయుడుగారమ్మాయి శైలజకు కూడా తెలియకపోతే? తెలుగు పత్రికలు ఉత్తరాది (హిందీ ప్రాంతం) మనుషులు, ప్రాంతాల పేర్లను ఖూనీ చేస్తూనే ఉంటాయి. హరియాణా సిర్సా కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సెల్జా కుమారి లేదా కుమారి సెల్జా అని అవి రాస్తే మనం ఇంగ్లిష్ స్పెలింగ్ Selja కాబట్టి తప్పు లేదనుకుంటాం. అంతేగాని…
Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!
Devi Navratri: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ…
Balagopal: స్మరిస్తేనే రోమాలు నిక్కపొడుస్తాయ్.. కారణజన్ముడికి నివాళి..!
ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఎవరితోనూ పోల్చలేని వ్యక్తి బాలగోపాల్. నలుగురికి ఉపయోగపడే పనికి ప్రతిరూపం ఆయన.సమస్యను సమ్యక్ దృష్టితో చూడ్టం, అర్థంచేసుకోపడం, అందరికీ అవగాహన కలిగించడం, సమాధానాలు-పరిష్కారాల కోసం ఉద్యమీకరించడం… ఇలా తాను ఆచరిస్తూ, ఉదాత్త నేతృత్వంతో హక్కులకై పోరాడే ఒక తరాన్నే తయారుచేసిన కర్మయోగి! ఆయన ఆలోచనల బలం, తాత్విక దృష్టి విశాలత్వం, ఆచరణలోని నిబద్దత… ఎందరెందరినో ప్రభావితం చేసి, అభిమానులుగా, హక్కుల కార్యకర్తలుగా జేసింది. అణచివేత, నిర్బంధం, పీడన, హక్కుల…
SuryaPeta: పెన్ పహాడ్ ZPHS (1997- 98) విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం..!
సూర్యాపేట: పెన్ పహాడ్ మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ 10 th ( 1997- 98) బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి గురువులైన శ్రీనివాస్ రెడ్డి , వెంకట్ రెడ్డి , అరుణ్ కుమార్ , శ్రవణ్ కుమార్ , లక్ష్మి కాంత రావు( రిటైర్డ్) లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇక కార్యక్రమంలో భాగంగా గురువులకు మొమెంటో బహుమతులను బహుకరించారు. 26 సంవత్సరాల తర్వాత అందరూ ఒకచోట…
Cybercrime: సైబర్ మోసగాళ్లకు మోసగాడు..!
BIG ALERT: పూర్తిగా చదవండి. మీకు ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లకు మోసగాడు ..! మొన్నొక రోజు వాట్సాప్‌కి మెసేజ్.. ‘మీరు పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా?’ అని. ఇలాంటి మెసేజ్లు నాకు అలవాటే కాబట్టి ‘అవును’ అని రిప్లై ఇచ్చాను. వెంటనే అటునుంచి ఓ సందేశం. అందులో ఏముంటుందో నాకు తెలుసు. ‘మా కంపెనీ మీకు కొన్ని టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేస్తే వెంటనే మీకు డబ్బు పంపిస్తుంది’ అని చెప్పారు….