వరుస సభలతో హోరెత్తిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు . పార్టీలోకి చేరికలతో పాటు వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభ, ముగింపు సభలను భారీగా నిర్వహించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఈసభలకు భారీ జనసమీకరణ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారు. ఐదు జిల్లాల్లో మూడు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాసమస్యలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఆగస్టు 2న ప్రారంభమయ్యే ప్రజాసంగ్రామ యాత్ర…

Read More

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల..

దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి   కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నోముల భగత్,mlc ,mc కోటిరెడ్డి.. mla సైదిరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎన్ఎస్పీ అధికారులు…. దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల….

Read More

చిన్నారి సమాధానానికి ప్రధాని ఫిదా.. వీడియో వైరల్!

ప్రధాని మోదీ ఓచిన్నారి మధ్య సంభాషణ వీడియో వైరల్ గా మారింది. నేను ఎవరో తెలుసా? అంటూ మోదీ ప్రశ్నించగా.. బదులుగా చిన్నారి చెప్పిన సమాధానానికి ప్రధాని ఫిదా  అయ్యారు. ఇంతకు ఆ చిన్నారి ఎవరూ? ప్రధాని మోదీని ఎందుకు కలిసింది? ఆపాప చెప్పిన సమాధానం ఏంటంటే?   आज का दिन अविस्मरणीय है। विश्व के सर्वाधिक लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री, परम आदरणीय श्री @narendramodi जी से…

Read More

ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు సోనియా ప్రయత్నం..

Nancharaiah Merugumala (senior journalist) -=========================================== మోతీలాల్‌ వోరాతోనే ఆపండి..దయచేసి మోతీలాల్‌ నెహ్రూ మీదకు దోషాలు తోసేయకండి, సోనియమ్మా, రాహుల్‌ భయ్యా! –––––––––––––––––––––––––––––––––– ఇండియన్‌ హెరాల్డ్‌ ప్రచురణ కంపెనీ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఆస్తుల అక్రమ వాల్చుడు కేసులో లావాదేవీలన్నీ దివంగత కాంగ్రెస్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కోశాధికారిగా 18 ఏళ్లు ‘లెక్కలు చూసిన’ మోతీలాల్‌ వోరా మాత్రమే చే శారని అమ్మాకొడుకులు సోనియా, రాహుల్‌ గాంధీలు ఈడీ అధికారుల ముందు చెప్పి…

Read More

‘మిస్సైల్ మ్యాన్’ స్మృతిలో..!!

శాస్త్రవేత్త..తత్వవేత్త..సాహితీవేత్త..ప్రకృతి ప్రేమికుడు..మార్గదర్శకుడు..అన్నిటికి మించి గొప్ప మానవతావాది..’మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ‘ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను యావత్ భారతావని స్మరించుకుంటుంది. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో కలాం జన్మించారు.1958 మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి తాను కలలు కన్న పైలట్ కల త్రుటిలో చేజారి పోవడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరారు. 1969 భారతదేశం తొలి…

Read More

బాలీవుడ్ లో మరోజంట బ్రేకప్..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో విడిపోవడం అన్నది సాధారణం.”నచ్చితే కలిసుంటాం.. నచ్చకపోతే క్షణం కూడా కలిసుండం.. అంత మాత్రానా మామధ్య ఏ సంబంధం లేదని కాదు.. మేము మాత్రం జీవితాతం మంచి స్నేహితులుగా కలిసి ఉండాలనుకుంటున్నాం “ఈమాటలు తరుచుగా బాలీవుడ్ సెలబ్రెటీలు నోట వింటుటాం. ఎందుకో ఈపాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎస్ మీరు గెస్ చేసింది నిజమే! బాలీవుడ్ లో మరో ప్రేమజంట విడిపోతుంది.టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేమపక్షులుగా సుపరిచితమైన షమితా శెట్టి- రాఖేష్ బాపట్…

Read More

మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం..!

మునుగోడు రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు ..ఉప ఎన్నికకు   దారితీసే అవకాశమున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.అటు అధికార టీఆర్ ఎస్ నేతలు అభివృద్ధి పనుల పేరిట క్యూకడుతుంటే .. ఇటు జిల్లా పై పట్టుసాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేజారిపోకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ…

Read More

సీబీఎస్ఈ ర్యాంకర్ కథ వింటే మెచ్చుకోకుండా ఉండలేరు!

టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పుట్టిపుట్టగానే ఎక్కడో ఓ చోట చెత్తకుండీల్లోనూ , నిర్మానుష ప్రాంతాల్లో పసికందులు దర్శనమిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. మనిషి ముసుగులో దాగున్న మానవమృగాల ముప్పు చెప్పనవసరం లేదు. ఇలా చెప్పుకుంటే ఒకటేమిటి అనేక సంఘటనలు నిత్యం చూస్తుంటాం. అలా వివక్షకు గురైన బాలిక ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొని సీబీఎస్ఇ ఫలితాల్లో సత్తాచాటింది. ఆమె కథను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం…

Read More

స్వర్ణపతక వీరుడు ‘నీరజ్’ ప్రస్థానం..

ఒకసారి యుద్ధం మొదలెట్టాక గెలవాలి లేదా ఓడాలి.. ఈడైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఆటగాళ్లకి. ఆటలో గెలిచిన వాళ్లు చరిత్ర సృష్టిస్తారు. ఓడినవాళ్లు గుణపాఠాన్ని నేర్చుకుంటారు.జావెలిన్‌ త్రో ఆటగాడు స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రస్థానం అలాంటిందే. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అతను.. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టతను రెపరెపలాడించాడు. తాజాగా అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ 88.13 మీటర్ల మేర జావలిన్‌ విసిరి సిల్వర్‌…

Read More

తెలంగాణలో బీజేపీ నేతల దూకుడు.. పార్టీలోకి భారీగా చేరికలు?

తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుమీదున్నారు. అధికార పార్టీ పై మాటల తూటాలు పేలుస్తునే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ప్రజాగోస భరోసా కార్యక్రమం పేరిట ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు కమలం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా.. అతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు అదే దారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరికలపై ఆపార్టీ అధ్యక్షుడు…

Read More
Optimized by Optimole