సాగు చట్టాలపై ఐఎంఎఫ్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నూతన వ్యవసాయ సాగు చట్టాల గురించి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిది) చీఫ్, ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ఆసక్తికర మంగళవారం వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని .. రైతుల ఆదాయవనరులు పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. సాగు చట్టాలు మార్కెటింగ్ వ్యవస్థకి…

Read More

నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల!

అవినీతి కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు నెచ్చెలి శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఆమె విడుదలకు సంబంధించి జైలు పత్రాన్ని ఉన్నతాధికారులు సమర్పించారు. గత వారం కరోనా సోకడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మరి కొన్ని రోజుల పాటు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె చెన్నైకి రానున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం….

Read More

నిమ్మగడ్డ బది’లీలలు’

అమరావతి: ప్రభుత్వంపై పోరాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన…

Read More

ఢిల్లీ అల్లర్ల లో సిద్దూ పాత్రపై అనుమానం!

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల వెనక బాలీవుడ్ నటుడు ,గాయకుడు దీప్ సిద్దూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సిద్దు తప్పుదోవ పట్టించాడని.. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టాడాని.. తద్వారా శాంతియుత ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల పెద్దలు ఆరోపించారు. సిద్దు ఎవరు.. రైతులతో సంబంధం ఏంటి..? పంజాబ్ గాయకుడిగా , బాలీవుడ్ నటుడిగా సిద్దుకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. అతను మంచి వక్త…

Read More

ఆస్కార్ రేసులో ‘ ఆకాశం నీ హద్దురా ‘

ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకత్వం తో పాటు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం పోటిపడుతుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన బాలమురళి నటించారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించడం విశేషం. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య…

Read More

రైతుల ఆందోళన హింసాత్మకం!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రూట్ మ్యాప్ విషయంలో రైతులు భిన్నంగా వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అల్లరిముకలు భద్రత సిబ్బంది పై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పారమిలటరీ బలగాలను…

Read More

మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read More

ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. అతను నటిస్తున్న మొదటి చిత్రం ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవి జోడిగా కన్నడ బ్యూటీ కీర్తి శెట్టి నటిస్తుండగా , ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్…

Read More

దాదా, ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివి : అజింక్య రహానే

ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం లో బీసీసీఐ చైర్మన్ గంగూలీ, ఎంసీఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివని అజింక్య రహానే పేర్కొన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ .. అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి తరువాత దాదా కాల్ చేసి స్పూర్తినిస్తూ మాట్లాడే మాటలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాయని అన్నారు. ఇక గాయాలతో దూరమైన సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం రాహుల్ ద్రావిడ్ అని స్పష్టం చేశారు. యువ…

Read More

‘లవ్ స్టొరీ’ ఏప్రిల్ లో విడుదల!

యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ప్రేమ కథల చిత్రాదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్…

Read More
Optimized by Optimole