ఆందోళన నుంచి తక్షణం తప్పుకుంటున్నాం : వీఎం సింగ్

వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల పోరాటంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుంచి తక్షణమే తాము తప్పు కుంటునట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) వీఎం సింగ్‌ బుధవారం ప్రకటించారు. నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే రోజున ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.ఎర్రకోట మీద జెండా…

Read More

‘ సైనా’ ఓటిటిలో రిలీజ్!

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా'(బయోపిక్). ఈ చిత్రంలో ఆమె పాత్రను బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పోషిస్తున్నారు. ఈచిత్రం పూర్తయి ఏడాది కావొస్తున్న కరోనా లాక్ డౌన్ తో వాయిదాపడింది. ఇప్పుడు ‘సైనా’ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాగా కరోనా లాక్ డౌన్ సడలింపులతో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ప్రేక్షకులు అంతగా సుముఖుతగా…

Read More

ఎర్రకోట ఘటన అవమానకరం : పంజాబ్ సీఎం

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద జరిగిన ఘటన అవమానకరమని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనను బాధించాయని.. ఎర్రకోటపై రైతులు జెండా ఎగరవేయడం దేశానికి అవమానకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనక ఎవరున్నారన్నది దర్యాప్తు చేయాలన్నారు. ఎర్రకోట ఘటన మాపనే : ఎస్ఎఫ్జె ఎర్రకోట పై జెండా ఎగరవేయడం మాపనే అని నిషేధిత…

Read More

దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

దర్శకధీరుడు రాజమౌళి ,తనను దారుణంగా మోసం చేశాడని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్ ఆర్. చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి కారణం. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ మైదాన్ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు తాను ఆరు నెలల ముందు ప్రకటించానని.. ఇప్పుడు రాజమౌళి బృందం ఎవరిని సంప్రదించకుండా ఆర్.ఆర్.ఆర్. చిత్ర విడుదల తేదీని ప్రకటించడం సబబు కాదని…

Read More

సాగు చట్టాలపై ఐఎంఎఫ్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నూతన వ్యవసాయ సాగు చట్టాల గురించి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిది) చీఫ్, ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ఆసక్తికర మంగళవారం వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని .. రైతుల ఆదాయవనరులు పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. సాగు చట్టాలు మార్కెటింగ్ వ్యవస్థకి…

Read More

నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల!

అవినీతి కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు నెచ్చెలి శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఆమె విడుదలకు సంబంధించి జైలు పత్రాన్ని ఉన్నతాధికారులు సమర్పించారు. గత వారం కరోనా సోకడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మరి కొన్ని రోజుల పాటు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె చెన్నైకి రానున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం….

Read More

నిమ్మగడ్డ బది’లీలలు’

అమరావతి: ప్రభుత్వంపై పోరాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన…

Read More

ఢిల్లీ అల్లర్ల లో సిద్దూ పాత్రపై అనుమానం!

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల వెనక బాలీవుడ్ నటుడు ,గాయకుడు దీప్ సిద్దూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సిద్దు తప్పుదోవ పట్టించాడని.. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టాడాని.. తద్వారా శాంతియుత ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల పెద్దలు ఆరోపించారు. సిద్దు ఎవరు.. రైతులతో సంబంధం ఏంటి..? పంజాబ్ గాయకుడిగా , బాలీవుడ్ నటుడిగా సిద్దుకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. అతను మంచి వక్త…

Read More

ఆస్కార్ రేసులో ‘ ఆకాశం నీ హద్దురా ‘

ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకత్వం తో పాటు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం పోటిపడుతుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన బాలమురళి నటించారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించడం విశేషం. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య…

Read More

రైతుల ఆందోళన హింసాత్మకం!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రూట్ మ్యాప్ విషయంలో రైతులు భిన్నంగా వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అల్లరిముకలు భద్రత సిబ్బంది పై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పారమిలటరీ బలగాలను…

Read More
Optimized by Optimole