MaharashtraexitPoll: ‘మహాయుతి’కి జైకొట్టిన మహారాష్ట్ర: పీపుల్స్ పల్స్
Maharashtra exit Poll2024:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్,…
JharkhandexitPoll: జార్ఖండ్ లో ఎన్డీఏ జయకేతనం : పీపుల్స్ పల్స్
Jharkhand exit Poll 2024:ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏన్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బీజేపీ, ఏజేఎస్యూ, జేడీ(యూ), ఎల్జీపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రంలో…
Sanatandharma: ఎంగిలి ఆకులపై పొర్లు దండాలు.. ఒక ఆచారం..!
విశీ : మతంలో చాలా వింత కాన్సెప్ట్‌లు ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి ‘పుణ్యం’. ఫలానా పని చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. దాన్ని చేసినవారే తప్పించి, పుణ్యాన్ని ఖాతాలో వేసుకున్నారా లేదా అని పరీక్షించే సాధనం లేదు. కొన్ని పనులు జుగుప్సాకరంగానూ ఉంటాయి. అయినా పుణ్యం కోసం చేయాల్సిందే! అది మతం(లేదా మతపెద్దలు) ఏర్పరిచిన కాన్సెప్ట్. ఇప్పడు కార్తికమాసం. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్లు భోజనం చేశాక(భిక్ష స్వీకరించాక) ఆ ఎంగిలి ఆకులు ఎత్తేందుకు చాలా…
Mensday: పురుషుల దినోత్సవం..ధీర గాంభీర్యాల వెనుక నిజ స్వరూపం..!
Satyavati Kondaveeti: ఆ మధ్య ఓ జాతీయస్థాయి ఆంగ్లపత్రిక ఆసక్తికరమైన ఒక వార్తను ప్రచురించింది.’లెటజ్ టాక్మెన్ ‘ (Let Us Talk Men) అనే ప్రోగ్రాం కింద ఢిల్లీలో కొన్ని డాక్యుమెంటరీ సినిమాలను ప్రదర్సిన్చారు.ఈ డాక్యుమెంటరీలన్నీ మగవారికి సంబందించిన ప్రవర్తన,వాళ్ళల్లో ఉండే అపసవ్య నమ్మకాలు, పురుషత్వం గురించిన భ్రమలు వీటన్నింటి గురించి చర్చించాయి. “ఇప్పటి వరకు పురుష ఉద్యమం మొదలవ్వకపోవటం నిజంగావిషాదం.ఇప్పటికైనా మగవాళ్ళు కళ్ళు తెరిచి తమ గురించి తాము తెలుసుకోవాలి.అనుభవాలుపంచుకోవాలి.అంతేకాకుండా ఫెమినిష్ట్ తరహాలో ఒక పురుష…
Indira Gandhi: మంత్రగత్తెను రాళ్లతో కొట్టి చంపినట్టే.. ఇందిరను బులెట్లతో నింపారు..!
Nancharaiah merugumala senior journalist: మంత్రగత్తె ముద్రేసి రాళ్లతో కొట్టి చంపినట్టే ఢిల్లీలో ప్రధాని ఇందిరను 40 ఏళ్ల క్రితం బులెట్లతో నింపారు ప్రథమ భారత ప్రధాని ఏకైక బిడ్డ ఇందిరాగాంధీ 1966 శీతాకాలంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే నాటికి పదేళ్ల నిండడానికి దగ్గర్లో ఉన్న మా తరం తెలుగోళ్లు చాలా మందికి ఆమె ఇప్పటికీ చిక్కుముడిగానే కనిపిస్తోంది. 1971 లోక్‌సభ ఎన్నికల నాటికి టీనేజీ పిల్లలమైన మాకు అప్పుడు ఇందిరాగాంధీ గెలవాలని అనిపించింది. నాలుగేళ్ల తర్వాత…
Telangana: సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ఆదరించండి: వేముల బిక్షం
Atmakur: ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న సిపియం పార్టీకి విరివిగా విరాళాలు అందించి ఆదరించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఓ ప్రకటనలో కోరారు. ప్రజా శ్రేయస్సు కై ఉద్యమాల ఊపిరిగా పోరాడుతున్న పార్టీని తమవంతు సహాయ సహకారాలు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీలల్లో సిపిఎం 3వ జిల్లా మహా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ…
IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!
IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…