murmu: చిరునవ్వుతో ద్రౌపది ముర్ము.. చిరాకు పెడుతూ దివంగత రాష్ట్రపతి..!
విశీ( సాయి వంశీ) : తాజాగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్‌లో కనిపించిన దర్పం, గాంభీర్యం ఆమెలో అసలు కనిపించవు. నా వరకూ నాకు పక్కింట్లో మనిషిని చూస్తున్న…
Brahmins: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..
Nancharaiah merugumala senior journalist: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై పెరుగుతున్న దాడులు… సామాజిక భద్రత కోసం ఉత్తరాదిన (రాజస్తాన్, హరియాణా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్) బ్రాహ్మణులు వీధుల్లో గొడ్డళ్లు చేతబూని ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఏడాది కాలంగా హిందీ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ జులూస్‌లు నిర్వహిస్తున్నారు. (బ్రామ్మల కులదేవత పరశురాముడి ఆయుధం గండ్ర గొడ్డలి) మరో పక్క తెలుగు బ్రాహ్మణులకు అనువైన నేలగా…
Shailakhan : పాకిస్తాన్ లో విప్లవం పుడుతోంది..!
విశీ( సాయి వంశీ):RESPECT TO YOU SHAILA KHAN.. పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్ షైలా ఖాన్ చేసిన పని మనమంతా తెలుసుకొని మెచ్చుకోవాల్సిన విషయం. ‘Naila Pakistani Reaction’ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు షైలా ఖాన్. ఆమెది పాకిస్థాన్‌లోని లాహోర్. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే వ్యక్తి. తన అక్క నైలా ఖాన్‌తో కలిసి మూడేళ్ల క్రితం యూట్యూబ్ చానెల్ మొదలుపెట్టింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 6.06 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రజల్లోకి…
APpolitics: మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి..!
Nancharaiah merugumala senior journalist: నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్ గఢ్ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజవర్గం ఉందనే విషయం నాకు తెలీదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్–ఐ తరఫున నారా…
Telangana: పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్: బండి సంజయ్
BjpTelangana: ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలు రావడంతో ‘ఇప్పుడు ఓటేయండి. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని మండిపడ్డారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేనోడు… తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనలేనోడు.. ఏకంగా…
SriRamaNavami: శ్రీరామనవమి వెనక ఇంత కథ ఉందా..!
Prasadrao: దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి…
GeorgeReddy: ఆ అమరత్వానికి యాభై రెండేళ్ళు..!
Gurramseetharamulu: ఆ నెత్తుటి మడుగుకు యాభై ఏళ్ళు నిండెనో సాయుధ పోరులో సాగిన త్యాగాల దారిలో ఒరిగిన అమరుల కథలు కావాలిప్పుడు జార్జ్ ఉంటే ఆయనకి ఇప్పుడు డెబ్భై ఏడు ఏళ్ళు వచ్చి ఉండేవి. ఆయనే ఉంటే చీలికలు పేలికలు అయిపోయిన ఎర్రజెండాలు దుస్థితి ని చూసి శ్రీ శ్రీ లా మతి చలించి ఉండేవాడు. గొప్ప ప్రత్యామ్నాయ రాజకీయాలు కలగన్న జార్జ్ దూరం అయి అప్పుడే యాభై రెండు ఏళ్ళ అవుతోంది. ఆయన పుట్టేనాటికి ఈ…