డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పరుగులు : పవన్ కళ్యాణ్
telanganaelections2023: ‘అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్దించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంద”ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ జిల్లా, తాండూరు…