ప్రధాని మోదీ కిడ్డీ బ్యాంక్ విగ్రహాలూ..!!

ఓ శిల్పి ప్రధాని మోదీ రూపంతో ఉన్న కిడ్డి బ్యాంక్ విగ్రహాలు తయారు చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఈ విగ్రహాలూ ఎందుకు తయారు చేస్తున్నాడు? ఆ విగ్రహాలతో ఏమైనా ఉపయోగం ఉందా?డబ్బులు దాచుకొనేందుకు వీలుగా ఉండే మోదీగారి విగ్రహాలను తయారు చేస్తున్నాడు.. బీహార్లోని ముజఫర్‌పూర్‌కు చెందిన శిల్పి జై ప్రకాష్. ప్రధాని మోదీ విగ్రహాలు మాత్రమే ఎందుకు తయారు చేస్తున్నారని ప్రశ్నంచగా.. పోయినేడాది దేశాన్ని, నికృష్ఠచైనా మహమ్మారి నుండి కాపాడడానికి గౌరవ ప్రధాని మోదీగారు దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ విధించారు.. ఆ సమయాన్ని నేను డబ్బులు సంపాదించే ఏదైనా వినూత్నమైన ఆలోచనపై వినియోగించాలని అనుకొన్నాను.. ఒక నెల కష్టపడి ఈ నమూనా తయారుచేశాను.. ఈ కిడ్డీ బ్యాంక్ లలో ఒక లక్ష రూపాయల ( నాణేలు, నోట్లతో కలిపి) వరకు దాచుకొనే వీలుంది.. అంతేకాక వీటి ద్వారా మన పిల్లలకు.. మోదీ గారి ఔన్నత్యం.. దేశ శ్రేయస్సుకై ఆయన చేపట్టిన అకుంఠిత దీక్ష.. పడుతోన్న తపన.. ఆయన కష్టపడే మనస్తత్వం.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న వైనం గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు వీలుగా కిడ్డీ బ్యాంక్ విగ్రహాలు తయారుచేస్తున్నాని ప్రకాశ్ తెలిపాడు.