పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్.సాగర్ చంద్ర దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెట్స్ నిర్మిస్తోంది. నిత్యామేనన్ , సంయుక్త మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్ ఆర్.. జనవరి 7న, రాధేశ్యామ్ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి బరి నుంచి బీమ్లానాయక్ తప్పుకుందని ఆయన అన్నారు. రెండు తెలుగు సినిమాలు అంతర్జాతీయస్థాయిలో విడుదల అవుతున్న నేపథ్యంలో వాటిని ప్రోత్సహించడానికే హీరో పవన్‌కళ్యాణ్, ప్రోడ్యూసర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. స్టార్ హీరోల సినిమాలు వారం వ్యవధిలో విడుదలైతే.. స్క్రీన్స్ షేరింగ్ ఇబ్బంది అవుతుందని.. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకునే సినిమాను వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు.
మరోవైపు క్రిస్మస్, న్యూయర్, సంక్రాంతి ఉండటంతో.. భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ క్యూలో కట్టాయి. ఇప్పటికే పుష్ప రిలీజ్ కాగా.. ఈనెల 24న నాని శ్యామ్‌సింగరాయ్ రిలీజ్ అవుతోంది. అటు టాలీవుడ్ మోస్ట్ అవెటెడ్ మూవీ త్రిపుల్-ఆర్.. జనవరి 7న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ నటిస్తున్న ప్యూర్ లవ్‌స్టోరీ రాధేశ్యామ్ వారం వ్యవధిలో.. జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల నిర్మాతలు విజ్ఞప్తితో భీమ్లానాయక్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపినట్లు దిల్‌రాజు తెలిపారు. అనంతరం భీమ్లానాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.