ఆమె వయస్సు 94 ఏళ్లు. అయితేనేం తనకున్న మక్కువతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంది. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె..ఈవయసులోనూ రెండు పుస్తకాలను రాస్తున్నారు. సొంత ఇంటిని మెడికల్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చి అద్దె ఇంటిలో ఉంటున్న ఆమె వ్యక్తిత్వానికి చేతులెత్తి మొక్కాలి. కాలం విలువైనదని.. క్షణం వృథాచేయకుడదని చెబుతున్న ప్రోఫెసర్ చిలుకూరి శాంతమ్మ జీవన ప్రయాణం గురించి తెలుసుకుందాం.
ప్రోఫెసర్ శాంతమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం.1929 మార్చి 8న ఆమె జన్మించారు.తల్లిదండ్రులు సీతారామయ్య,వనజాక్షమ్మ. తండ్రి న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. ఆమె 5 వ ఏటనే తండ్రి మరణించాడు. విద్యాభ్యాసమంతా రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో గడిచింది. విశాఖపట్నం ఏవీఎన్ కళాశాలలో ఆమె ఇంటర్మీడియట్ పూర్తయింది.
ఆమెకు చిన్నతనం నుంచి సైన్స్ అంటే ఆసక్తి. ఈక్రమంలోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్స్ లో పట్టు సాధించింది. మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుంచి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకుంది. 1951లో ఆంధ్రా యూనివర్సీటీలో భౌతికశాస్ర విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. అనంతరం 1956లో ఆమె ఉద్యోగం రెగ్యులరైజ్ అయ్యింది.
కాగా 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశారు శాంతమ్మ. పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే ఆమె.. పాఠాలు బోధించాలనే మక్కువతో మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరారు. అక్కడే ఆరేళ్లు పనిచేశారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్ గా పనిచేశారు.
శాంతమ్మకు చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అతను తెలుగు ప్రొఫెసర్ కావడంతో ఆమెకు ఉపనిషత్తుల బోధించేవారు. దాంతో శాంతమ్మకు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై ఆసక్తి ఏర్పడింది. ఈక్రమంలోనే భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్ డైరెక్టివ్‘ అనే పుస్తకాన్ని రచించింది. అనుకోని పరిస్థితుల్లో భర్త సుబ్రహ్మణ్య శాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. భర్త అనారోగ్య సమయంలో తోడుగా ఉన్నటువంటి అబ్బాయికి ఆమె స్వయంగా పెళ్లి జరిపించింది. ఇప్పడు అతనికి ముగ్గురు పిల్లలు. వారితో కలిసి ఆమె అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది.
ఆమె గత ఐదేళ్లుగా విజయనగరంలోని సెంచూరియన్ యూనివర్సీటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు శాంతమ్మ. ఆమె పనిచేస్తున్న యూనివర్శిటీ రాజు.. 50 ఏళ్ల క్రితం ఆమె శిష్యుల్లో ఒకరు కావడం గమన్హారం.
“94 ఏళ్ల వయసులోనూ రెండు ఊత కర్రల సాయంతో అంత దూరం ప్రయాణించి పాఠాలు బోధిస్తున్న శాంతమ్మ జీవితం భావితరాలకు ఆదర్శం”