Rahul Gandhi: ఐదు రెట్లు పెరిగిన రాహుల్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ బేస్..

భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ మెరుగైంది. సోషల్ మీడియాలో సైతం అతని ఫాలోయింగ్ .ఊహించని రేంజ్లో అమాంతం పెరిగిపోయింది. జోడో యాత్రకు ముందు గాంధీ యూట్యూబ్ ఛానల్స్ సబ్ స్క్రైబర్స్ తో పాటు వ్యూయర్ షిప్ దారుణంగా ఉండేవి. కానీ జోడో యాత్ర తర్వాత సోషల్ మీడియాలో గాంధీ హవా ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో కాంగ్రెస్ పార్టీ విషయములో మెయిన్ స్ట్రీమ్ మీడియా కవరేజ్ లో పక్షపాతం చూపిస్తుండడంతో గాంధీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫోన్స్ వేదికగా చేసుకుని ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కొనసాగిస్తున్నారు.

 

కాగా రాహూల్ గాంధీ టీం ఆగస్టు 10, 2017న యు-ట్యూబ్‌ ఛానల్ ఓపెన్ చేసింది. ఈ ఐదేళ్ళలో ఛానల్ సబ్‌స్క్రైబర్ బేస్ 0.5 మిలియన్లు మాత్రమే ఉంది. జోడో యాత్ర అనంతరం (2023 ఆగస్టు 2023 వచ్చేసరికి) సబ్‌స్క్రైబర్ బేస్ 2.6 మిలియన్లకు అంటే అక్షరాల ఐదు రెట్లు పెరిగింది. గత నెలలో గాంధీ మణిపూర్ పర్యటనకు సంబంధించిన ఆరు వీడియోలను ఆయన టీమ్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేయగా.. రెండు వీడియోలు మూడు మిలియన్ల వ్యూస్ దాటాయి. దీంతో కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ విభాగానికి అధిపతి అయిన ప్రవీణ్ చక్ రావర్తి స్పందిస్తూ…
చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాను బిజెపి నియంత్రిస్తున్నప్పుడు, యూట్యూబ్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలకు మా సందేశాన్ని అందించడం తప్ప వేరే మార్గం లేదు” అని ఆయన  చెప్పుకొచ్చారు.

Optimized by Optimole