Healthtips: వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టైఫాయిడ్, కలరా, మలేరియా వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని.. ఏమరపాటు వద్దని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇవ్వడం పరిపాటి. శీతాకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి శాస్త్రవేత్తలు ముఖ్య సూచనలు చేశారు. వర్షకాలంలో ఈగల పట్ల జాగ్రత్త పాటించాలని హెచ్చరించారు. ఈగలు వాలిన ఆహరం తింటే టైఫాయిడ్, కలరా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు . ఈగలకు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేసే సామర్థ్యం ఉందని తాజా పరిశోధనలో తేలినట్లు నిపుణులు చెబుతున్నారు. వర్షకాలంలో వ్యాధులు సోకకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి తగు జాగ్రత్తలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.