Rajasingh : లోక్ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన జైపాలస్తీనా స్లోగన్ పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. అటు బీజేపీ నేతలతో పాటు దేశభక్తులు సోషల్ మీడియా వేదికగా ఓవైసీని ఏకిపారేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ రాజాసింగ్ ఓవైసీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.పాలస్తీనాపై ప్రేమ ఉంటే తాపత్రయం ఏందుకు..దేశాన్ని విడిచి అక్కడి వెళ్లి తుపాకీ పట్టుకోవాలని దెబ్బిపొడిచారు.పాలస్తీనాకు వెళితే మీలాంటి వారి పరిస్థితి ఏంటన్నది ఇతరులకు అర్థమవుతుందని కామెంట్ చేశారు.భారతదేశంలో ఉంటూ భారత్ మాతాకీ జై.. జైభారత్ అనడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు. మీ స్థానంలో ఉండి జై ఇజ్రాయిల్ అంటే ఊరుకునే వారా? ఏదో మునిగిపోయిన మాదిరి నానా హంగామా చేసేవారు కాదా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.